NEET UG 2024: నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా దరఖాస్తు చేసుకోండి.!!

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

New Update
NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా..

NEET UG 2024:  దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షకు మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9న తేదీ రాత్రి 9గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంగ్లీష్ , హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష మే 5న మధ్యాహ్నం, 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తదితర వివరాల కోసం https://nta.ac.in/medicalexam అనే వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి: ఆర్బీఐ కఠిన నిర్ణయం..ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు..కారణం ఇదే..!!

Advertisment