ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

ECIL: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 4 సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech)తోపాటు మూడేళ్ల డిప్లొమా ఉండాలి.

New Update
ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

ECIL Recruitment 2023 : ఇంజీనిరింగ్ అండ్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలకు ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో వివిధ ఖాళీలను భర్తి చేయబోతున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. అసక్తిగల అభ్యర్థులు మరో రెండు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 363 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. వాటిలో 250 పోస్ట్ లు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA)లకు, 113 పోస్ట్ లు డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు రిజర్వ్ చేశారు. ఈ రెండు కేటగిరీల అప్రెంటిస్‌షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.

Also read :ఆయనతో కిస్‌ సీన్స్‌ అంటేనే చెమటలు పట్టేస్తాయి.. అయినా మూడు సినిమాలు చేశా: తనుశ్రీదత్తా

విద్య అర్హతలు:
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా AICTE-ఆమోదిత కళాశాల లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. అలాగే డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు అప్లై చేసే అభ్యర్థులు ఏప్రిల్ 1, 2021 నాటికి సంబంధిత కోర్సుల్లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ లను ఆన్ లైన్ లో డిసెంబర్ 15 వరకూ సబ్మిట్ చేయాలి. పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ సంప్రదించండి - https://www.mysarkarinaukri.com/en/ecil/

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP INTER RESULTS 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు Hi అని మెసేజ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి. 

New Update
AP Inter Results

AP Inter Results

AP INTER RESULTS 2025:

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు Hi అని మెసేజ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి. దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకుని మెమోగా కూడా వాడవచ్చు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారు. 

గత పదేళ్లలో ఇంత ఉత్తీర్ణత శాతం లేదని..

ఏపీ ఇంటర్‌  ఫలితాలను విడుదల చేస్తూ.. నారా లోకేశ్‌ మాట్లాడారు. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదే నమోదైందని తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment