PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 21 నుంచి నుంచి 23 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. రీసెంట్‌గా రష్యాలో పర్యటించిన ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. By Manogna alamuru 19 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Poland, Ukrain Visit: పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పంపిన ఆహ్వానాల మేరకు భారత ప్రధాని మోదీ ఆ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మొదటిసారిగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవలే మోదీ రష్యాలో పర్యటించి...ఆదేశ అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. రష్యాతో తమకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని చెప్పారు అన్నికాలాల్లో రష్యా తమకు మిత్రదేశమేనని తెలిపారు. మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యని పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ చెబుతోంది. యుద్ధం ప్రస్తుత కాలంలో పరిష్కారం కాదని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్ వెళ్ళడం ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు కాస్త ఆగ్రం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటన దాన్ని చెరిపేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలను నార్మల్ చేయడానికి ప్రధాని ఉక్రెయిన్ పర్యటన సహకరిస్తుందని అంటున్నారు. ఇక 45 ఏళ్ళ తర్వాత పోలాండ్‌లో పర్యటించే మొదటి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయ్యాయి. పోలాండ్ దేశంలో 25,000 మంది భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని రక్షించడానికి పోలాండ్ సహకరించింది. ఇదే కాకుండా 1940లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6000 మంది పోలాండ్ మహిళలు, పిల్లలకు భారతదేశంలోని జామ్‌నగర్, కోల్హాపూర్ రాజులు ఆశ్రయం ఇచ్చారు. Also Read: M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌కు సిద్ధం #pm-modi #ukrain #poland #visit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి