Noni Fruit: మధుమేహాన్ని నోని పండు తగ్గించలేదా?.. వైద్యులు ఏమంటున్నారు?

నోని జ్యూస్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. నోని పండులో పదార్థాలను పరిశీలిస్తే తగినంత మొత్తంలో మినరల్ పొటాషియం, విటమిన్ సి, బయోటిన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. కానీ ఇవి మధుమేహం, క్యాన్సర్ తగ్గేలా చేసే కారకం ఈ పండులో లేదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Noni Fruit: మధుమేహాన్ని నోని పండు తగ్గించలేదా?.. వైద్యులు ఏమంటున్నారు?

Noni Fruit: నోని పండును ఇండియన్ మల్బరీ అంటారు. ఇది మన దేశంలో పండే పండు కాదు, ప్రస్తుత కాలంలో ఇది మన దేశంలో కూడా పండుతుంది. ప్రాథమికంగా ఈ పండు ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో పెరిగే పండు. అక్కడి నేలకు, వాతావరణానికి బాగా పండుతుంది. అక్కడ ఈ పండును కోసి ఉప్పు వేసి తింటారు. దీనిని కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ పండు పుల్లగా, చాలా చేదుగా ఉంటుంది. ఈ పండు మన దేశ వాతావరణానికి, నేలకు సరిపడదు. నోని పండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్యాన్సర్ తగ్గించే గుణం ఈ పండుకు లేదు:

అయితే.. గత 7-8 సంవత్సరాలుగా నోని జ్యూస్‌కు విపరీతమైన ప్రచారం, డిమాండ్ ఉంది. అయితే నోని పండులో పదార్థాలను పరిశీలిస్తే తగినంత మొత్తంలో మినరల్ పొటాషియం, విటమిన్ సి, బయోటిన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం, క్యాన్సర్ తగ్గేలా చేసే కారకం ఈ పండులో లేదు. కాబట్టి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని నిపుణులు అంటున్నారు. శరీరంలో పొటాషియం పెరిగితే అది మన కాలేయానికి ఆటంకం కలిగిస్తుంది. కిడ్నీ, గుండె సమస్యలు వస్తాయి.

రసాయనాలు కలిపి పండ్లు తింటే ఆరోగ్యానికి హాని:

నోని పండు చాలా చేదుగా ఉండటం వల్ల తొందరగా చెడిపోతుంది. చెడిపోకుండా రసాయనాలు కలుపుతారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. నోని పండు ఎన్నో రోగాలను నయం చేస్తుందనేది అబద్ధమని వైద్యులు అంటున్నారు. ఈ పండులో ఉండే పోషకాలు ఇతర పండ్లలో కూడా ఉంటాయని చెబుతున్నారు. నోని పండ్లలోని సిట్రిక్ కంటెంట్ నిమ్మకాయలు, నారింజలతో సహా ఇతర పుల్లని పండ్లలో కూడా ఉంటాయని వీటిని ప్రతిరోజు తింటే నోని పండ్ల కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: రాజులు చలికాలంలోనే మాంసం తింటారా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు