Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు కరోనా మహమ్మారి డయాబెటిస్ ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులు కొవిడ్‌యేతర అనారోగ్యాల వల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పు పెరిగినట్లు వెల్లడించారు. By B Aravind 25 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మహమ్మారిపై తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో మరో కీలక విషయం వెలుగుచూసింది. కరోనా మహమ్మారి మధుమేహం ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులకు కొవిడ్‌యేతర అనారోగ్యాల వల్ల వారి ప్రాణాలకు ముప్పు పెరిగినట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. Also Read: కుంగుబాటుతో కూడా బరువు పెరుగుతారు.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు కంటిచూపు కోల్పోయినవారు ఎక్కువే లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచూరితమయ్యాయి. ప్రపంచంలో 138 అధ్యయనాలను నిర్వహించగా.. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు క్రోడీకరించి ఈ అధ్యయాన్ని ప్రచూరించారు. వాళ్లు బయటపెట్టిన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత డయాబెటిస్ ఉన్నవారు కంటిచూపు కోల్పోయిన కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. పిల్లలు కూడా ఐసీయూల్లోకి ముఖ్యంగా మహిళలు, బలహీనంగా ఉన్నవారు, చిన్నారుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు కొవిడ్ తర్వాత మరణాలు సంభవించడంతో పాటు డయాబెటిస్ సమస్యతో పిల్లలు కూడా ఐసీయూల్లో చేరుతున్న కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రాణాంతకంగా భావించే డయాబెటిక్ కెటోయాసిడోసిస్ (డీకేఏ) కేసులు కూడా పెరుగుతున్నాయని పరిశోధకులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. Also Read: పగటిపూట నిద్రపోయే అలవాటు ఉందా ? అయితే బీ కేర్ ఫుల్ !! #health-news #covid-19 #diabetes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి