Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే వేటే!

అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ సర్కార్ బహుభార్యత్వంపై ఉక్కుపాదం మోపుతోంది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని ఆదేశించింది. వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నా కూడా రాష్ట్ర సర్కార్ పర్మిషన్ లేకుండా రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

New Update
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే వేటే!

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ ఆదేశించింది. వారికి సంబంధించిన వ్యక్తిగత మతాల అనుమతులు ఉన్నా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా.. మరోసారి పెళ్లి చేసుకోకూడదని తెలిపింది. ఈ మేరకు అస్సాం సర్కార్‌ అక్టోబర్ 20న ఇచ్చిన ఆఫీసు మెమోలో ఈ సూచనలు చేసింది.

Also Read: కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన

ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే.. బలవంతపు పదవీ విరమణతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎస్ నీరజ్ వర్మ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే, బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలని అనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే అసెంబ్లీ సెషన్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్‌లో ప్రవేశపెడతామని అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములు బతికుండగా.. రెండో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనే ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు