Andhra Pradesh : డెప్యుటేషన్ అధికారులను రిలీవ్ చేేసేది లేదు.. ఏపీ ప్రభుత్వం ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సెలవులనూ తిరస్కరిస్తోంది. By Manogna alamuru 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Deputation Officers : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. డెప్యుటేషన్ మీద వచ్చిన వారిని రిలీవ్ చేయమని చెప్పింది. కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ (IG Ramakrishna) మాతృ సంస్థకు వెళ్తానంటూ సీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పాటూ ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ కు గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక తక్షణం బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి (Vijay Kumar Reddy) అడుగుతున్నారు. తన మాతృ శాఖకు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ ను కోరిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి..దరఖాస్తులు పెట్టుకున్నారు గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలు చేసింది. అందుకే ఇప్పుడు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణా (Telangana) కు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్. రావత్ తో పాటు తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు సీఐడీ చీఫ్ సంజయ్ కూడా తన సెలవు ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు. Also Read : 56 అంగుళాల ఛాతి వీరుడు.. ఛాయ్‌వాలా టు హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు! #andhra-pradesh #government #deputation-officers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి