Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Budget : 2024-25 సంవత్సరానికి గానూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటపాటూ ఆమె ప్రసంగం సాగింది. మధ్యంతర బడ్జెట్(Interim Budget) లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని చెప్పారు. దీన్ని 8 లక్షల వరకు పెంచుతారని బావించారు కానీ దానికి సంబంధించిన ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇక ఉద్యోగుల కోసం మాత్రం స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50వేల నుంచి 75వేలకు పెంచారు. ఇక ప్రత్యక్ష పన్నులు అయితే మూడు రెట్లు పెరిగాయి. ఇక మరోవైపు కార్పొరేట్ ట్యాక్స్(Corporate Tax) ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా ఉందని... అందుకే ఫిజికల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు. ఇక 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం(Revenue Income) రూ.30.08 లక్షల కోట్లు వచ్చిందని తెలిపారు నిర్మలా సీతారామన్. అలాగే ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం ఉందని..ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు. Also read:సొంత ఇంటి కలను నేరవేరుస్తాం…నిర్మలా సీతారామన్ వచ్చే ఐదేళ్ళల్లో అద్భుత ప్రగతి... ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Vote On Account Budget) లో మొత్తం 46.77లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఐదేళ్ళల్లో బారత్ అద్భుతమైన ప్రగతిని సాధించబోతోందని అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్ధిక విధానాలుంటాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటలైజూషన్ చాలా కీకలమని..దాని కోసం ఇండియాను డిజిటల్ ఇండియాగా మారుస్తామని తెలిపారు. ఇన్ కమ్ ట్యాక్‌లో సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడింది. మూలధన పెట్టుబడులకు ‘గిప్ట్(GIFT)’ ఒక ప్రధాన మార్గంగా అవతరించిందని నిర్మలా వివరించారు. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. #parliament #central #nirmala-sitharaman #finance-minister #interim-budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి