TS News: న్యూఇయర్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాట.. ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు విషాదాంతం అయ్యాయి. రేవంత్ రెడ్డి పాట పెట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన కాంగ్రెస్ నేత సాదుల రాములు చికిత్స పొందుతూ చనిపోయారు. By Nikhil 01 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy Song Issue: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నిన్న నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో రేవంత్‌రెడ్డి పాట విషయంలో గొడవ చోటు చేసుకుంది. దీంతో రేవంత్‌రెడ్డి పాటను ప్లే చేయడంతో స్థానికులు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ సందర్భంగా జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు గాయాలపాలయ్యాడు. ఇది కూడా చదవండి: Crime News : కొత్త ఏడాది కోలుకోలేని విషాదాలు..ఇప్పటికే ఎంత మంది చనిపోయారంటే? దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బీఆర్‌ఎస్ కార్యకర్తలే రాములును హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పరారీలో ఉండగా.. పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. #telangana #cm-revanth-reddy #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి