Telangana : తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది రేవంత్ సర్కార్. దీని కోసం ఫ్రిబ్రవరి నెలాఖరులోపల అర్హుల నుంచి దరఖాస్తును స్వీకరించనుంది. అభయహస్తం సంబంధం లేకుండా రేషన్ కార్డుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. By Manogna alamuru 23 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ration Cards : ప్రజాపాలన(Praja Palana) మీద రేవంత్ సర్కార్(Revanth Sarkar) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆరు గ్యాంటీల(6 Guarantees) అమలు కోసం అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను సర్వీకరిస్తామంటూ ప్రకటించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటి కోసం అర్హతదారులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అప్లికేషన్ల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ కసరత్తులు చేస్తోంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే.. రేషన్ కార్డుల అప్లికేషన్లను స్వీకరిస్తామని తెలిపింది. Also Read:వర్ధంతి ఎరుగని చంద్రబోస్ జయంతి ఇవాళ.. ఎక్కడ చేసుకోవాలి... మీసేవ(Mee-Seva) కేంద్రాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు తీసుకున్న అధికారులు... అందులో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నవి పరిగణించడం లేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్(Congress) ఆరు గ్యారెంటీలకు రేషన్‌కార్డు(Ration Card) లే ప్రామాణికంగా నిలవనున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అభయహస్తంకు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డులు కావాల్సిందే. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి పొందుతున్నారని అధికారులు లెక్కలు చెబుతున్నారు. వారి సంఖ్య అధికం.. ఇక ఇటీవల స్వీకరించిన ప్రజా పాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులున్నాయి. రేషన్ కార్డులు, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ముఖ్యంగా ఐదు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటం విశేషం. అలాగే దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. Also Read : Canada Study Permit: కెనడా నిర్ణయం.. భారత విద్యార్థులకు షాక్.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టమే! #telangana #applications #ration-cards #revanth-sarkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి