Thailand: కరోనా లాంటి మరో వైరస్‌.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..

థాయ్‌లాండ్‌లో మరో కొత్త వైరస్‌ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ వల్ల గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

New Update
Thailand: కరోనా లాంటి మరో వైరస్‌.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..

Bat Virus In Thailand: ప్రపంచంలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకురావడం ఆందోళన రేపుంతోంది. ప్లేగు వ్యాధి, ఎబోలా, నిఫా, కరోనా లాంటి వైరస్‌లు ప్రపంచాన్ని ఎలా వణికించాయో అందిరికీ తెలిసిందే. ఇవే కాకుండా ఇంకా కొత్త వైరస్‌లు కూడా ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా థాయ్‌లాండ్‌ మరో వైరస్‌ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ వల్ల గబ్బిలాల (Bats) నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ (EcoHealth Alliance) అనే పరిశోధనా సంస్థ తెలిపింది.

అయితే ఈ వైరస్‌ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని.. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) సమావేశంలో డాక్టర్ పీటర్ దస్జాక్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో గతంలో పరిశోధనలు జరిపిన ఈ ఎకోహెల్త్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ ల్యాబ్ నుంచే కరోనా కరోనా వైరస్ లీకైందని అప్పట్లో పలు అనుమానాలకు దారితీశాయి. అయితే వీటిని ఈ సంస్థ కొట్టిపారేసింది. అయితే థాయ్‌లాండ్‌లో కొత్తగా గుర్తించిన వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని పీటర్ దస్జాక్ అన్నారు.

Also Read: అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు

థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో ఉన్న గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే అక్కడి స్థానిక రైతులు ఈ గుహ నుంచే గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎరువులోనే ఆ వైరస్‌ ఉన్నట్లు చెప్పారు. మనుషులతో ఎక్కువగా కాంటక్ట్‌ అవుతున్న ఈ వైరస్‌ రాబోయే రోజుల్లో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు.

ఇదిలాఉండగా.. గత నెలలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరిగాయి. డిసెంబర్‌ నెలలో చూసుకున్నట్లేతే దాదాపు 10 వేల మంది కరోనా బారినపడి మరణించినట్లు WHO వెల్లడించింది. కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌ 1 (COVID-19 JN.1) వ్యాప్తిచెందడం అలాగే ప్రజలు కూడా సెలవుల్లో గుమికూడటం వల్లే కేసులు పెరిగినట్లు తెలిపింది.

Also Read: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం…జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతులకు భారతీయుల రక్తం అనేక సార్లు అంటుకుంది. అసిమ్ మునీర్ గతంలో ISI (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. భారత్‌పై జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక అసిమ్ మునీర్ హస్తం ఉంది. ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్ అంనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో పర్యటకులపై జరిగిన టెర్రర్ అటాక్‌ను 3 రోజుల ముందు అసిమ్ మునీర్ కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. అది తమ ప్రధాన రక్తనాళమని ఆయన చెప్పాడు. ఈ వ్యాఖ్యలతోనే రెచ్చి పోయి లష్కరే తో యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉద్రవాద సంస్థ కశ్మీర్ లో అటాక్ చేసిందని ఇండియన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నారు. అంతేకాదు 2018 నుంచి భారత్‌పై జరిగిన టెర్రర్ అటాక్‌ల కుట్రల వెనుక అసిమ్ మునీర్ ఉన్నారని కొన్ని సందర్భాలని పరిశీలిస్తే అర్థమవుతుంది. 

2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 40 మంది CRPF సైనికులు అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. ఈ దాడి జరిగినప్పుడు అసిమ్ మునీర్ ISI చీఫ్‌గా ఉన్నాడు. ఐఎస్ఐకి తెలియకుండా ఇంత పెద్ద ఉగ్రదాడి జరగదని భారతదేశం నమ్ముతుంది.

2016 జనవరి 2న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో ఏడుగురు భారతీయ భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. అసిమ్ మునీర్ 2018 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించినందున ఆయన అప్పుడు ISI చీఫ్ కాదు. ఈ దాడుల వెనుక ISI, పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మునీర్ ఆ ఉగ్రదాడిలో కీలక కుట్రదారుడని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

Advertisment
Advertisment
Advertisment