Venu Swamy : వామ్మో.. ఒక్క జాతకం చెబితే అన్ని వేలా.. వేణుస్వామి ఫోన్ కాల్ లీక్!

వేణు స్వామి ఆడియో కాల్ ఒకటి లీకై నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఒకతను వేణు స్వామి అసిస్టెంట్ కు ఫోన్ చేసి వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలని అడుగుతాడు. దానికి అసిస్టెంట్.. 'ఒకరికి జాతకం చెప్పాలంటే పది వేలు అవుతుందని' చెబుతుంది. ఇది విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

New Update
Venu Swamy : వామ్మో.. ఒక్క జాతకం చెబితే అన్ని వేలా.. వేణుస్వామి ఫోన్ కాల్ లీక్!

Venu Swamy : సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియా (Social Media) లో ఫుల్ పాపులర్ అయిన వేణు స్వామి (Venu Swamy) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. చెప్పినట్లే జరిగింది. అక్కడితో వేణు స్వామికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.

అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ (YS Jagan) గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు. దాంతో ఈయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక రీసెంట్ గా నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వాళ్ళిద్దరి జాతకం చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ మధ్య వేణు స్వామి స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసిన అందులో ఓ జర్నలిస్ట్ తనను బెదిరిస్తున్నాడంటూ చెప్పడం వివాదంగా మారింది.

Also Read : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!

ఇలాంటి తరుణంలో వేణు స్వామి ఆడియో కాల్ ఒకటి లీకై నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఒకతను వేణు స్వామి అసిస్టెంట్ కు ఫోన్ చేసి వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలి, ఆయన అపాయింట్ మెంట్ కావాలని అడుగుతాడు. దానికి అసిస్టెంట్.. 'ఒకరికి జాతకం చెప్పాలంటే పది వేలు అవుతుందని' చెబుతుంది. దాంతో అతను వేణు స్వామిని ఓ రేంజ్ లో తిడతాడు. ఈ ఆడియో క్లిప్ విన్న నెటిజన్స్.. వేణు స్వామి జాతకం చెప్పడానికే పది వేలు తీసుకుంటాడా? అంటూ షాక్ అవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment