Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు!

నేపాల్‌ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు!

Floods: నేపాల్‌ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చిత్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ మీడియాతో తెలిపారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇంద్రదేవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఖాట్మండు వెళ్తున్న బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి డీలక్స్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు వాహనంపై నుంచి దూకారు.

ఇదే ఘటనలో నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ట్వీట్‌ చేస్తూ నారాయణగర్‌-ముగ్లిన్‌ రోడ్డు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లడంతో బస్సు కొట్టుకుపోవడంతో దాదాపు ఐదు డజన్ల మంది ప్రయాణికులు తప్పిపోయారన్న వార్త నాకు చాలా బాధ కలిగించింది. నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హోం అడ్మినిస్ట్రేషన్‌తో సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయాణికుల కోసం వెతికి వారిని సమర్థవంతంగా రక్షించాలని ఆదేశాలుజారీ చేసినట్లు వివరించారు.

Also read: నేడు కవిత లిక్కర్‌ సీబీఐ కేసు విచారణ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

మధ్యప్రదేశ్‌లో ఫేక్ డాక్టర్‌గా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌ దామోహ్‌ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

New Update
 FAKE DOCTORS

FAKE DOCTORS

మధ్యప్రదేశ్‌లో ఫేక్ డాక్టర్ ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ వైద్యుడిగా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడైన నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌ దామోహ్‌ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేవాడు. ఫేక్ డాక్టర్ అని ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 5 నుంచి 7లక్షల విలువైన పోర్టబుల్‌ ఎకో మిషన్‌ను అతను దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆసుపత్రిలోని పరికరాలను కూడా..

వీటిని దొంగతనం చేయడానికి ఇతరుల సాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళా డాకర్ట్‌కు చెందిన ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు అన్ని తీసుకుని ఫేక్ డాక్టర్‌గా ఆసుపత్రిలో చేరాడు. ఫేక్ డాక్టర్ దమోహ్‌ దగ్గర శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్‌‌జాన్‌‌కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్‌ వైద్యుడి పేరు వాడుకొ దమోహ్ కార్డియాలజిస్టుగా చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment