/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T184919.255-jpg.webp)
NCERT Recruitment 2024: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (NCERT) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం అందించబోతుంది. ఈ మేరకు తమ సంస్థలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు ఒప్పంద ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు ప్రూఫ్ రీడర్ (Proof Readers), అసిస్టెంట్ ఎడిటర్ (Assistant Editors), డీటీపీ ఆపరేటర్ (DTP Operators) పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్లు/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హత..
కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 170 పోస్టులను భర్తీ చేస్తుండగా.. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ/పీజీని విద్యార్హతగా పేర్కొన్నారు. నాలుగు నెలల కాల వ్యవధితో ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు గత అనుభవం తప్పనిసరి.
ఇది కూడా చదవండి : Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ?
డీటీపీ ఆపరేటర్స్..
డీటీపీ ఆపరేటర్స్ పోస్టులు 50 (ఇంగ్లిష్ 20, హిందీ 20, ఉర్దూ 10) భర్తీ చేయనుండగా ఈ పోస్టులకు వయో పరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. నెలకు వేతనం రూ.50వేలు చొప్పున చెల్లిస్తారు. ఫిబ్రవరి 1న స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్, ఫిబ్రవరి 2,3 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ప్రూఫ్ రీడర్..
ప్రూఫ్ రీడర్ పోస్టులు 60 (ఇంగ్లిష్ 25, హిందీ 25, ఉర్దూ 10) ఉండగా.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి వయో పరిమితి 42 ఏళ్లు. ప్రింటింగ్/పబ్లిషింగ్ సంస్థలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. నెలకు వేతనం రూ.37వేలు. ఫిబ్రవరి 1న స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్, ఫిబ్రవరి 2న స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అసిస్టెంట్ ఎడిటర్..
అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు 60 (ఇంగ్లిష్ 25; హిందీ 25, ఉర్దూ 10) ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారికి 50 ఏళ్ల వయో పరిమితి. నెలకు రూ.80వేలు చొప్పున వేతనం ఇస్తారు. స్క్రీనింగ్, రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 1న; స్కిల్ టెస్ట్ ఫిబ్రవరి 3న దిల్లీలో నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకొనేవారు ఇంటర్వ్యూ సమయంలో బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.