Drugs : 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఐదుగురు పాకిస్థానియులు అరెస్ట్ గుజరాత్ పోర్‌బందర్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న నౌక నుంచి 3,300 కేజీల డ్రగ్స్‌ను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. మంగళవారం అనుమానస్పదంగా ఓ చిన్నపాటి నౌక భారత జలాల్లోకి ప్రవేశించగా.. అధికారులు దాన్ని ముట్టడించి సీజ్ చేశారు. ఆ నౌకలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. By B Aravind 28 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి International Smuggling Rocket : అరేబియా సముద్రంలో మరోసారి అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్(International Smuggling Rocket) ను ఛేదించింది భారత నౌకాదళం. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తో కలిసి నౌకదళం తాజాగా సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా గుజరాత్ పోర్‌బందర్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న నౌక నుంచి 3,300 కేజీల డ్రగ్స్(Drugs) ను స్వాధీనం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. Also Read : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా.. అసలేం జరుగుతోంది? 3089 కిలోల డ్రగ్స్ స్వాధీనం ఇక వివవరాల్లోకి వెళ్తే.. మంగళవారం అనుమానస్పదంగా ఓ చిన్నపాటి నౌక భారత జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని గుర్తించిన నౌకదళం అధికారులు వెంటనే దాన్ని ముట్టడించారు. ఆ నౌక నుంచి ఏకంగా 3089 కిలోల చరాస్.. 158 కిలోల మైథామైఫ్తమైన్ అలాగే 25 కేజీల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నౌకలో ఉన్న ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాయి. అయితే వాళ్లందరూ కూడా పాకిస్థాన్‌కు చెందినవారని నౌకాదళం ప్రకటన చేసింది. ఇటీవలే పట్టుబడ్డ డ్రగ్స్ ఇదిలా ఉండగా.. ఇటీవల దాదాపు 2,500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, ఢిల్లీ(Delhi) లో భారీ ఎత్తున మ్యావ్ మ్యావ్ (మెఫెడ్రిన్) అనే డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. పుణే నగరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ వద్ద ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్(Pharmaceutical Plant) లో 700 కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా ఇటీవల సోదాలు నిర్వహించగా.. 400 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. Also Read : జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ! #telugu-news #drugs #national-news #navy #international-smuggling-rocket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి