Health News: షాకింగ్‌ స్టడీ..తీపి తింటే కాలేయం కాటికే.. ఎందుకో తెలుసుకోండి!

తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారికి కాలేయం దెబ్బతింటుందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ కథనం చెబుతోంది. గుండె జబ్బులు, కొవ్వు కాలేయ వ్యాధి, ఊబకాయం ప్రమాదాన్ని చక్కెర పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ప్యాంక్రియాస్, కాలేయంతో సహా ముఖ్యమైన అవయవాలకు హాని కలిగిస్తుంది.

New Update
Health News: షాకింగ్‌ స్టడీ..తీపి తింటే కాలేయం కాటికే.. ఎందుకో తెలుసుకోండి!

Health News: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అన్ని అవయవాల్లో కాలేయం పాత్ర చాలా ముఖ్యమైనది. మన కడుపు, ప్రేగుల నుంచి వచ్చే రక్తమంతా కాలేయం గుండా వెళ్తుంది. కాలేయం ఈ రక్తాన్ని ప్రాసెస్ చేస్తుంది. దానిని బ్రేక్‌డౌన్ చేసి పోషకాలను నిల్వ చేస్తుంది. ఇది మాత్రమే కాదు శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అటు ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. తీవ్రమైన కాలేయ వ్యాధి కూడా ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి ఆరోగ్య నిపుణులు ఈ అవయవ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలందరికీ సలహా ఇస్తారు.

nature journal study says heavy sugar intake leads to hyper tension

ఆల్కహాల్ జోలికి వెళ్లద్దు:

కాలేయానికి హాని కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడిన వాటిలో ఆల్కహాల్ ప్రముఖమైనది. ఆల్కహాల్ కాలేయానికి కలిగించే సమస్యల గురించి చాలా అధ్యయనాలు హెచ్చరించాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి.

publive-image

పంచదార..షుగర్‌తో రిస్క్‌:

ఆల్కహాల్ లాగానే ఎక్కువ చక్కెరను ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు కూడా తీవ్రమైన కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల బృందం కనుగొంది. చక్కెర గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, కొవ్వు కాలేయ వ్యాధి,ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది తీవ్రమైన, ప్రాణాంతక కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నేచర్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైంది. శాస్త్రవేత్తలు చక్కెరను ఎక్కువ పరిమాణంలో లేదా పదేపదే తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఫ్రక్టోజ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకత, డైస్లిపిడెమియా (అదనపు ట్రైగ్లిజరైడ్స్), హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాలేయానికి కూడా హానికరం. కాలక్రమేణా ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు. ఇది ప్యాంక్రియాస్, కాలేయంతో సహా ముఖ్యమైన అవయవాలకు హాని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: వేసవిలో మూత్రం పసుపు రంగులో వస్తుందా?.. ఈ వ్యాధికి కారణం కావొచ్చు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు