/rtv/media/media_files/2026/02/04/yumnam-khemchand-singh-set-to-be-next-manipur-cm-2026-02-04-07-03-26.jpg)
Yumnam Khemchand Singh set to be next Manipur CM
మణిపుర్ నూతన సీఎంగా యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర్ NDA శాసనసభపక్ష నేతగా ఆయన్ని పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఢిల్లీలోని మణిపుర్ భవన్లో మంగళవారం రాష్ట్ర ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో సహా ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వీళ్లందరూ ఖేమ్‌చంద్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
Also Read: భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం..‘ఎస్ఎఫ్డీఆర్’ పరీక్ష విజయవంతం
అంతకుముందు మణిపుర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. అక్కడ ఖేమ్‌చంద్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2017 నుంచి 2022 వరకు ఖేమ్‌చంద్ మణిపుర్ అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. 2022లో బీరెన్‌సింగ్ సర్కారులో ఆయన మంత్రిగా నియమితులయ్యారు. మణిపుర్లో మూడు కీలక సామాజిక వర్గాలతో అంటే మైతేయ్, కుకీ, నాగాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇది కూడా ఆయనకు కలిసొచ్చింది. బుధవారం ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ కోరనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బాబు పడ్డాడని చెప్పి డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయించింది..వీడియో వైరల్!
ఇదిలాఉండగా 2023లో జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అక్కడ రాష్ట్రపతి పాలన నడుస్తోంది. మణిపుర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2022 ఎన్నికల్లో బీజేపీ నుంచి 32 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత అయిదుగురు JDU శాసనసభ్యులు బీజేపీలో చేరారు. ఇక ఆరుగురు సభ్యులున్న NPP, అయిదుగురు ఎమ్మెల్యేలున్న ఎన్పీఎఫ్ సైతం రాష్ట్రంలో NDA భాగస్వామ్యమే.
Follow Us