/rtv/media/media_files/2025/02/10/1zJz2HXZHSgmwvvDBbup.jpg)
YouTuber Ranveer Allahbadia apologises for obscene jokes on comedy show
యూట్యూబర్ రన్వీర్ అల్లబాడియా ఓ కామెడీ షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన అభ్యంతరకర జోక్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడు స్పందించాడు. దీనిపై క్షమాపణలు కోరాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రన్వీర్ అల్లబాడియాకు బీర్ బైసిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. కోట్లాదిమంది ఇతడి వీడియోను చూస్తారు. కేంద్రమంత్రులు సైతం ఇతడి పోడ్‌కాస్ట్‌కు వస్తారు. ఇంత ఫేమస్ యూట్యూబర్ అయిన రన్వీర్ ఓ కామెడీ షోలో చేసిన జోక్స్ వివాదాస్పదమయ్యాయి.
Also Read: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!
కలర్స్ టీవీ ఆధ్వర్యంలో నడిచే ఇండియాస్ గాట్ టాలెంట్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రాయ్, ఇతర సెలబ్రిటీలు జడ్జిలుగా ఉంటారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో యూట్యూబర్ రన్వీర్ అల్లబాడియా కూడా జడ్జిగా పాల్గొన్నారు. అయితే ఈ షోకు వచ్చిన ఓ మహిళ కంటెస్టెంట్‌తో రన్వీర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. '' మీ తల్లిదండ్రులు వారి జీవితాంతం సెక్స్ చేయడం ప్రతిరోజూ నువ్వు చూస్తావా ? లేదా ఓసారి వాళ్లతో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా ?'' అని అడిగాడు. అక్కడున్న వాళ్లందరూ దీన్ని కామెడీగా తీసుకొని నవ్వారు.
Nahh man 😭
— CaLM dAdA (@faded_clone17) February 8, 2025
Beerbicep's would you rather are wild 😭😭 pic.twitter.com/GKJGw4BYke
కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రన్వీర్‌పై నెటిజెన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రన్వీర్ తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ క్షమాపణలు కోరాడు.
I shouldn’t have said what I said on India’s got latent. I’m sorry. pic.twitter.com/BaLEx5J0kd
— Ranveer Allahbadia (@BeerBicepsGuy) February 10, 2025