/rtv/media/media_files/2024/12/20/ULDKNXjHgILWuc5EjMGd.jpg)
You Tube
యూట్యూబ్ లో ఉన్న హానికరమైన కంటెంట్ మరెక్కడా ఉండదు. ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత వీడియోలు, వేధింపులు, హింస లాంటి ఈ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే అది పెట్టేస్తుంటారు. యూట్యూబ్ మీద ఎప్పుడూ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇన్నాళ్ళు వీటిని పెద్దగా పట్టించుకోలేదు యూట్యూబ్ యాజమాన్యం. కానీ ఫిర్యాదులు ఎక్కువ అవుతుండడంతో ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేస్తోంది. హానికరమైన కంటెంట్ ను గుర్తించి తొలగిస్తోంది. కేవలం మూడు నెలల వ్యవధిలో దాదాపు 95లక్షల వీడియోలు, 45లక్షల ఛానెళ్లను తీసేసింది. ముఖ్యంగా భారత్లో అత్యధిక ఈ తొలగింపులు జరిగాయి. దాదాపు 30లక్షల వీడియోలను యూట్యూబ్ యాజమాన్యం తొలగించింది.
ఇక మీద ఆటలు చెల్లవ్..
ఈ కంటెంట్ ను తొలగించడానికి యూట్యూబ్ ఏఐను వాడుతోంది. చెత్త వీడియోలను ఎక్కువ మంది చూడ్డానికి ముందే గుర్తించ తొలగించేలా ఏర్పాట్లు చేసింది. వీటిలో ప్రమాదకరమైన కంటెంట్, వేధింపులు,హింసాత్మక దృశ్యాలు, స్పామ్, తప్పుదారి పట్టించే కంటెంట్ వీడియోలు య్యూట్యూబ్ తొలగించిన జాబితాలో ఉన్నాయి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 95 లక్షలు వీడియోలు యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. పిల్లల భద్రతకు ముప్పు కలిగించే వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. ఇలాంటివి సుమారు 50లక్షల వీడియోలను య్యూట్యూబ్ తొలగించింది. కేవలం వీడియోలు మాత్రమే కాకుండా.. యూట్యూబ్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి 45లక్షల ఛానెళ్లను కూడా ఏరి పారేసింది. అక్కడితో ఆగలేదు. పలు వీడియోల కింద ఉన్న 1కోటి2లక్షల కామెంట్లను కూడా డిలీట్ చేసింది. దాంతో పాటూ యూట్యూబ్ ఛానెల్స్ ఉండాలంటే రూల్స్ ను స్ట్రిక్ట్ అములు చేయాలని హెచ్చరించింది యూట్యూబ్ యాజమాన్యం.
యూట్యూబ్ ప్లాట్ ఫామ్ భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని చెప్పింది. వీడియోలు అప్లోడ్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు చెక్ చేుకోవాలని సూచించింది.
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
rsp maoist Photograph: (rsp maoist)
Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..
అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
rs-praveen | amithsha | today telugu news
నీ కొడుకు కోసం నేను పూజలు చేస్తున్న.. !! | Lady Aghori Special Puja For Pawan Kalyan Son Mark | RTV
కోకాపేట్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు || Illegal Construction Demolished in Kokapet | Hyderabad | RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Raja Singh | RTV
Pawan Kalyan Emotional On YS Jagan Tweet | జగన్..నీ సాయం మరువను | Pawan Son Mark Shankar | RTV
Mujra Party At Moinabad Farm House | ముజ్రా పార్టీలో గలీజ్ డ్యాన్సులు | Hyderabad | SOT Police | RTV