Mood of the Nation poll : బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా యూపీ సీఎం యోగి నిలిచారు. కేజ్రీవాల్ రెండవ స్థానంలో, మమతా బెనర్జీ మూడవ స్థానంలో, ఎంకే స్టాలిన్‌ నాలుగో స్థానంలో, చంద్రబాబు ఐదో స్థానంలోనిలిచారు. రేవంత్ ర్యాంకును మాత్రం వెల్లడించలేదు.

New Update
best cm yogi

best cm yogi

ఇండియా టూడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చాలా స్థానాల్లో ఓడిపోయినప్పటికీ 30 రాష్ట్రాలలోని మెజారిటీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా ఓటు వేశారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ 30 రాష్ట్రాలలో 1,36,463 మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించబడింది.

సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 33 శాతం మంది ఆదిత్యనాథ్‌ను ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో (13.8%) నిలిచారు.  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడవ స్థానంలో నిలిచారు, 9.1 శాతం మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేశారు.  4.7 శాతం మంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ నాలుగో స్థానంలో నిలువగా..  ఐదవ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. అయితే ఎంకే స్టాలిన్‌, చంద్రబాబు మధ్య కేవలం 0.1 శాతం మాత్రమే తేడా ఉంది.  అయితే తెలంగాణ సీఎం రేవంత్ ఎన్నో స్థానంలో ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు.  

తగ్గిన యోగి ప్రజాదరణ 

లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ పరంగా 12 శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది . అప్పుడు చేసిన సర్వేలో దాదాపు 51 శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పని పట్ల సంతృప్తి చెందారని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 39 శాతానికి పడిపోయింది.  2023ఆగస్టులో చేసిన సర్వేలో దాదాపు 47 శాతం మంది ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే  ద్వారా సీఎం మమతా బెనర్జీ ప్రజాదరణ 33 శాతం (ఫిబ్రవరి 2024 సర్వే) నుండి 46 శాతానికి  (ఆగస్టు2024 సర్వే) పెరిగింది. పశ్చిమ బెంగాల్‌ లోక్ సభ ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుని టీఎంసీ తన పట్టును నిలుపుకోగా.. . 2019లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 11 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.  

Also read :  Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాకిచ్చిన పోలీసులు... 7 సెక్షన్ల కింద కేసులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment