/rtv/media/media_files/2026/04/02/floccinaucinihilipilification-2026-04-02-14-54-37.jpg)
Why is Floccinaucinihilipilification trending? How Delhi court order on FM Sitharaman made rare English word viral
ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి పలికిన ఓ 29 అక్షరాల ఇంగ్లీష్ పదం వైరల్ అవుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై దాఖలైన పరువునష్టం కేసుపై విచారించిన న్యాయమూర్తి ఈ పదాన్ని ప్రయోగించారు. అసలు దీన్ని ఎలా పలకాలి ? దీని అర్థం ఏంటని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి సతిమణి లిపికా మిశ్రా గతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై పరువు నష్టం దావా వేశారు.
Also Read: పక్షికి 50 మంది బాడీగార్డులు.. గుజరాత్ అటవిశాఖ హైటెక్ హంగామా!
2024లో ఎన్నికలు జరిగిన సమయంలో నిర్మలా సీతారామన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లిపికా మిశ్రా ఆరోపించారు. తన వైవాహిక విభేదాల గురించి మాట్లాడుతూ పరవు నష్టం కలిగించారంటూ పిటిషన్‌లో తెలిపారు. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. ‘ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్ అనే పదాన్ని వాడారు. లిపికా మిశ్రా చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేశారు.
Also Read: పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్
ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్ అంటే ఏంటి ?
ఒక విషయాన్ని నిరుపయోగమైనదిగా చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు. దీని అర్థం ఆ సంబంధిత అంశం పనికిరానిదని, విలువలేదని అర్థం. లాటిన్ భాష నుంచి ఈ పదం వచ్చింది. locci, nauci, nihili, pili అనే నాలుగు పదాలను కలిపి ఈ పదాన్ని రూపొందించారు. 'విలువ లేదు' అని ఈ పదాల అర్థం. ఇది పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే రోజువారి సంభాషణల్లో దీన్ని వాడరు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఈ పదాన్ని వాడారు. తాజాగా కోర్టు తీర్పులో ఈ పదాన్ని వాడటంతో ఈ పదంపై మరింత ఆసక్తి రేపింది.
Follow Us