TVK Vijay: సీఎంగా విజయ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్‌ ఇచ్చే పార్టీలు ఇవే !

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం స్వల్ప దూరంలో ఉండిపోయింది. దీంతో విజయ్‌తో ఏ పార్టీలు కలుస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

New Update
TVK Vijay

TVK Vijay

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం స్వల్ప దూరంలో ఉండిపోయింది. దీంతో టీవీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇందుకోసం మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. దీంతో విజయ్‌తో ఏ పార్టీలు కలుస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇప్పటికే కాంగ్రెస్‌కు బహిరంగంగా పిలుపునిచ్చారు. 

Also Read: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్‌ 5, PMK 5, లెఫ్ట్‌ పార్టీలు నాలుగు స్థానాల్లో మెజార్టీలో ఉన్నాయి. ఈ పార్టీలతో కలిసి విజయ్‌ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. కానీ కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు DMK కూటమిలో ఉన్నాయి. ఇక PMK పార్టీ NDAలో ఉంది. దీంతో ఈ చిన్న పార్టీలు టీవీకేకు సపోర్ట్ ఇస్తాయా ? లేదా ? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ పార్టీలతో పొత్తు కుదరకుంటే AIADMK లాంటి పెద్ద పార్టీలతో కలిసే అవకాశాలు కూడా ఉన్నట్లు మరికొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read: ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!

అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVK వ్యూహకర్తలు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీలతో కలవాలనే దానిపై మంతనాలు జరుపుతున్నారు. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతే టీవీకే విజయ్‌కు ఎవరు సపోర్ట్ ఇస్తారనేది తేలనుంది. ఎవరితో పొత్తు పెట్టుకున్న మొత్తానికి విజయ్ సీఎం పదవిని చేపట్టనున్నారు.  

Advertisment
తాజా కథనాలు