Delhi: అంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది...ఢిల్లీ తొక్కిసలాటకు కారణం అదేనా?

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు బలిగొంది. ఇందులో 11 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రయాగ్ రాజ్ వెళ్ళాల్సిన రైళ్లు రద్దయ్యాయనే పుకారు చెలరేగడమే తొక్కిసలాటకు కారణం అని అంటున్నారు. 

New Update
delhi

New Delhi Railway Station Stampede

పుణ్యం సంపాదించుకుందామనుకుంటే...ఏకంగా ప్రాణాలే పోయాయి. ప్రయాగ్ రాజ్ వెళ్ళి పవిత్ర సంగమంలో స్నానాలు చేద్దామనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు న్యూ ఢిల్లీలో ప్రయాణికులు. నిన్న రాత్రి అక్కడి రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 30 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉంది. మరోవైపు చనిపోయినవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. 

Delhi Railway station stampede

Also Read: Second Batch: అమృత్ సర్ చేరుకున్న అక్రమవలసదారుల రెండవ విమానం

ఒక పుకారే ప్రాణాలు తీసిందా..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫామ్ లపై  తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళాకు రైళ్లలో వెళ్లే భక్తుల రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ నుంచి  ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 14వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి ఉంది. అలాగే 12వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్.. 13వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రావాల్సి ఉంది. కానీ  రెండు రైళ్ళూ క్యానసిల్ అయ్యాయనే పుకారు సడెన్ గా చెలరేగింది. ఇది మొత్తం రైల్వే స్టేషన్ అంతా వ్యాపించింది. దీంతో ప్రయాణికులు అందరూ 14 వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ వైపు పరుగులు తీశారు. అక్కడ ఉన్న ట్రైన్ లోకి ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లపై నుంచి కొంతమంది కిందపడిపోయారు. కింద పడిన వారిని తొక్కుకుంటూ వెళ్లి.. మిగిలిన ప్రయాణికులు కిందపడిపోయారు. దీంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఇదంతా కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. 

delhistampede
delhistampede

 

ఎవరూ మాట వినలేదు...

రైళ్లు రద్దవ్వలేదని..తొందరపడొద్దని న్యూ ఢిల్లీ రైల్వే అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాదు స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీసులు కూడా జనాలకు చెబుతూనే ఉన్నారు. కానీ అక్కడ ఎవరూ మాట వినలేదు అని తొక్కిసలాట ప్రత్యక్ష సాక్షి అయిన భారత వైమానికదళం సార్జెంట్ ఒకరు చెప్పారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను శాంతపర్చడానికి ప్రకటనలు చేసినా వారిని అదుపుల చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. తాను కూడా ఎంతో ప్రయత్నం చేశానని..కానీ ప్రమాదం జరగకుండా ఆపలేకపోయానని సార్జెంట్ తెలిపారు. నా స్నేహితులలో ఒకరి సహాయంతో నేను గాయపడిన వారికి కూడా సహాయం చేసానని చెప్పారు. 

Also Read: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment