/rtv/media/media_files/2025/04/11/1StYNVFhYLKbb8M6DJrN.jpg)
Mumbai Attack Mastermind Headley
ముంబయ్ దాడులకు మరో కీలక సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లీ. ఇతనే ఫస్ట్ ముంబయ్ లో రెక్కీ నిర్వహించాడు. ఇతనికి రాణా సహకరించాడు. వీరిద్దరు ఇచ్చిన ప్లాస్ తో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. హెడ్లీ అమెరికన్-పాకిస్తాన్ ఉగ్రవాది. రాణా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం అయింది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్‌కు వచ్చాడని.. ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని ఎన్ఐఏ చెబుతోంది. భారత్ కు వచ్చినప్పుడల్లా పదులసార్లు రాణాతో హెడ్లీ మాట్లాడేవాడని తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్ఐఏ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది.
హెడ్లీని అమెరికా అప్పగించదు..
తహవూర్ రాణా అప్పగింతలో అగ్రరాజ్యం భారత్ కు అన్ని విధాలా సహకరించింది. అక్కడ న్యాయస్థానాలు కూడా రాణా పిటిషన్లను చాలాసార్లే కొట్టివేశాయి. కానీ హెడ్లీ విషయంలో మాత్రం అలా జరగదు అంటున్నాయి నిఘా వర్గాలు. చట్ట, దౌత్యపరమైన కారణాలున్నాయని చెబుతున్నారు. తనను భారత్, పాక్, డెన్మార్క్‌లకు అప్పగించవద్దని 2010లోనే అమెరికా అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. ఇదంతా చట్టప్రకారమే జరిగిందని...దానికి తోడు రాణాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో హెడ్లీకి మరణశిక్ష కూడా తప్పిందని చెప్పారు. ముంబయి దాడుల్లో ప్రమేయం, లష్కరే తోయిబా, పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాల గురించి హెడ్లీ అంగీకరించడంతో అమెరికా దర్యాప్తు సంస్థలకు అతను కీలక వ్యక్తిగా మారాడు. దాంతో పాటూ అతనికి అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్బీఐతో సంబంధాలున్నాయి. అతను గతంలో వాటికి ఇన్ఫార్మర్ గా కూడా పని చేశాడు. దాని వల్లనే ముంబయ్ దాడుల గురించి అమెరికా ముందే తెలుసని కూడా అంటున్నారు. ఇంత బ్యాగ్రౌండ్ ఉన్న అతనిని అమెరికా అప్పగించదు. ఎందుకంటే హెడ్లీ ద్వారా తమ దేశ నిఘా కార్యకలాపాలు బయటకు వస్తాయని అమెరికా భావిస్తోంది. మరొక విషయం ఏంటంటే..హెడ్లీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అతనికి ఉరిశిక్ష వేయకూడదు. కానీ భారతదేశం ఆ షరతుకు అంగీకరించలేదు. కసబ్ ను ఉరి తీసిన ఇండియా మిగతా వారిని కూడా అదే చేయాలనే ఆలోచనలో ఉంది. ఇది కూడా హెడ్లీ అప్పగింతకు అడ్డుగా మారిందని ఎన్ఐఏ నిఘా వర్గాలు వివరిస్తున్నాయి.
today-latest-news-in-telugu | mumbai-attack | india | usa
Also Read: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..