దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం !

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో భారత్‌లో పలు నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం (WFH) ఇవ్వాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. 

New Update
Wells Fargo VP urges companies to encourage WFH amid LPG shortage

Wells Fargo VP urges companies to encourage WFH amid LPG shortage

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.  ప్రపంచ దేశాలకు చమురును సరఫరా చేసేందుకు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికే మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఇప్పటికే భారత్‌లో పలు నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం (WFH) ఇవ్వాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. 

Also Read: పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో మూతబడుతున్న యూరియా ప్లాంట్లు

వెల్స్‌ ఫార్గో అనే ఫైనాన్సియల్ సర్వీస్ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌ దీని గురించి తన లింక్డిన్‌లో పోస్టు చేశారు. దేశంలో ఎల్‌పీజీ కొరత నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు. ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు దూర ప్రయాణాలు చేస్తారని వాళ్లతో ఇంటి నుంచే పని చేయించుకుంటే ఇంధనం ఆదా అవుతుందన్నారు. దీనివల్ల ఆస్పత్రులు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా లాంటి అత్యవసర రంగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.  కంపెనీలు సామాజిక బాధ్యతతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.  

సోషల్ మీడియా చంద్రశేఖర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అయితే భారత్‌లో ఇంధన కొరత ప్రభావం అంతగా లేదని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే దీనిపై హైప్ క్రియేట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. రాబోయే 10-20 రోజుల్లో ఈ పరిస్థితులు సద్ధుమణుగుతాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం చంద్రశేఖర్ చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్నారు. దేశంలోని ప్రతిరోజూ లక్షలాది మంది కార్లు, బైకులపై తమ కంపెనీలకు వెళ్తారని.. దీనివల్ల చమురు ఎక్కువగా అవసరం అవుతుందని అంటున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కేటాయిస్తే ఇంధన కొరత ఉండదని చెబుతున్నారు. కంపెనీలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 

Also Read: ఇజ్రాయెల్‌‌,ఇరాన్ యుద్ధానికి ముగింపేపుడు? వార్‌లోకి దిగి ట్రంప్ తప్పుచేశాడా.?

మరోవైపు దేశంలో ప్రస్తుతం LPG కొరత ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తున్నాయని ప్రచారం నడుస్తోంది. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. LPG ఉత్పత్తిని 10 శాతం పెంచినట్లు పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు