/rtv/media/media_files/2025/04/07/cczY2q4Ns2jqphzAvp7V.jpg)
Food adulteration
Food Adulteration: ఒకవైపు వాతావరణ కాలుష్యంతో పాటు ఆహారం కూడా కల్తీ మయమవుతోంది. ఈ మధ్య జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫుడ్ సెఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో పేరుగాంచిన హోటళ్లలోనూ కల్తీ ఆయిల్ ఇతర పదార్థాలు వాడుతున్నారని తేలింది. అంతేకాదు క్వాలిటీ లేని ఆహారపదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఆహార పదార్థాల తయారీలో.. వాటిని నిల్వ చేయడంలో.. ప్యాకింగ్‌లో ఇలా అన్నిట్లోనూ కల్తీనే. ఇక నూనెలు, కారం పొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా లాంటివి అన్ని ప్రస్తుతం కల్తీ అవుతూనే ఉన్నాయి. మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆహార పదార్థాల కల్తీ భారీగా పెరిగిపోయింది.
ఎక్కడపడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు రాత్రి, పగలు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. ఇక సిటీల్లో అయితే ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ బయటే కానిచ్చేసే వారు ఎందరో ఉన్నారు. మందుబాబులకు అయితే చెప్పాల్సిన పనే లేదు. ఏం తింటున్నాం.. ఏం తాగుతున్నాం అనే విషయం కూడా వారికి ఆలోచనకు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే అదనుగా చేసుకొని నాణ్యతను పట్టించు కోకుండా అడ్డగోలుగా ఆహార పదార్ధాలను కల్తీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే 2021-- 24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది. ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి.
Also Read: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
నామమాత్రపు తనిఖీలు..
ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. 14 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక ఆ తర్వాత 13.11 శాతంతో కేరళ.. 9 శాతంతో ఆంధ్రప్రదేశ్.. 6.30 శాతంతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కలు చూసి ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. లైసెన్సుల జారీ విషయంలోనే మరింతగా నియమాలు అమలు చేయాలని అంటున్నారు. కల్తీలను అరికట్టేందుకు ఫుడ్ సెప్టీ అధికారులు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!