రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద వీటిని గుర్తించడం దుమారం రేపింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

New Update

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ సీటు వద్ద వీటిని గుర్తించడం దుమారం రేపింది. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ''గురువారం సభను వాయిదా వేసిన అనంతరం భద్రతా అధికారులు ఛాంబర్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబర్ సీటు వద్ద నోట్ల కట్టను గుర్తించారు.   

Also Read: కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?

ఇది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. అందులో రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించాం. ఆ నోట్లు అసలైనవో.. నకిలీవో క్లారిటీ లేదు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాను. ఈ విషయాన్ని సభకు చెప్పడం నా బాధ్యత కాదని'' ధన్‌ఖడ్ అన్నారు. అయితే ధన్‌ఖడ్ చేసిన ప్రకటనపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. దీనిపై విచారణ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. దర్యాప్తు కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Also Read: త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శిస్తా: కేంద్ర జలశక్తి మంత్రి

మరోవైపు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పేరు చెబితే తప్పేంటనీ.. ఏ సీటు వద్ద డబ్బు దొరికిందో, అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారని తెలిపారు. ఇలా నోట్ల కట్టను సభకు తీసుకురావడం సరికాదన్నారు. దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు. అలాగే రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు