/rtv/media/media_files/2025/03/24/4Ok2zEgBTejyQBoxaTpk.jpg)
Crocodile
ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని రోడ్డుపై ఓ భారీ మొసలి సంచరించడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. అనంతరం క్యాంపస్‌లో సంచరించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మొసలిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయాందోళకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
A crocodile drifted its way from Powai Lake into IIT situated Padmavati Devi temple today. Source: Powai COP Group, posted by a Powaiite. Further details awaited. pic.twitter.com/9eG6AiPxwD
— Planet Powai (@PlanetPowai) March 24, 2025
Also Read: రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం..కోర్టు కీలక ఆదేశం
సమాచారం మేరకు పోలీసులు, జంతు ప్రేమికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ మొసలి వల్ల ఎవరికీ కూడా ఏమి జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక సరస్సులోకి అది వెళ్లినట్లు జంతు రక్షకులు చెప్పారు. అది పొవై అనే సరస్సు నుంచి వచ్చినట్లు భావించారు. అది ఆడ మొసలి అని.. గుడ్లు పెట్టడం కోసం తగిన స్థల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Also Read: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్
అలాగే ప్రజలు భయపడొద్దని కూడా జంతురక్షకులు తెలిపారు. మొసళ్ల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొసళ్లు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఐఐటీ క్యాంపస్‌లో ఇలా మొసలి దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
Also Read: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే
iit-bombay | telugu-news | national-news | rtv-news