/rtv/media/media_files/2026/04/18/bar-2026-04-18-14-40-45.jpg)
Violence by liquor bar boys in Nagpur
Nagpur : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. మద్యం ఇవ్వలేదనే కోపంతో కొందరు యువకులు బార్‌లో వీరంగం సృష్టించారు. మానేవాడ చౌక్‌లోని ఎస్కే బార్ సిబ్బందిపై వారు దాడి చేశారు. అర్ధరాత్రి వేళ బార్‌లో హంగామా సృష్టించారు. ఈ దాడిలో మేనేజర్‌కు తీవ్రగాయాలు కాగా.. మరో వ్యక్తికి స్వల్పగాయాలు అయ్యాయి. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Breaking News | नागपूरमध्ये बार बंद झाल्यानंतर काही युवकांनी दारू न मिळाल्याने मॅनेजरवर बाटल्यांनी हल्ला केला. घटना CCTV मध्ये कैद, व्हिडिओ सोशल मीडियावर व्हायरल.#Nagpur#CrimeNews#ViralVideo#CCTV#Maharashtrapic.twitter.com/LoaZa3Gnsv
— Maharashtra Bandhu News (@BandhuNews_in) April 17, 2026
Breaking News | नागपूरमध्ये बार बंद झाल्यानंतर काही युवकांनी दारू न मिळाल्याने मॅनेजरवर बाटल्यांनी हल्ला केला. घटना CCTV मध्ये कैद, व्हिडिओ सोशल मीडियावर व्हायरल.#Nagpur#CrimeNews#ViralVideo#CCTV#Maharashtrapic.twitter.com/LoaZa3Gnsv
— Maharashtra Bandhu News (@BandhuNews_in) April 17, 2026
ఏప్రిల్ 16వ తేదీ అర్ధరాత్రి కొందరు యువకులు బార్‌కు వచ్చారు. అప్పటికే సమయం ముగియడంతో సిబ్బంది మద్యం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చారు. మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు.అనంతరం మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మిగతా యువకులంతా లోపలికి దూసుకు వచ్చి భయానక వాతావరణం సృష్టించారు. సిబ్బందిపై చేతులతో పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. ఇష్టమెుచ్చినట్లు చావ కొట్టారు. బాటిళ్లతో దాడి చేశారు.
ఆ యువకులు మద్యం బాటిళ్లతో బార్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. కేవలం నిమిషం వ్యవధిలోనే పద్దెనిమిది బాటిళ్లతో మేనేజర్‌ను చితకబాదారు. దీంతో అతడి తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. తల, ముఖం, ఇతర భాగాలపై గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. బట్టలు మెుత్తం చింపేశారు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం అవుతున్నా అతన్ని వదిలిపెట్టకుండా రణరంగం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వ్యక్తికి కూడా ఈ దాడిలో స్వల్ప గాయాలయ్యాయి.
ఈ దాడిలో మొత్తం పది మందికి పైగా పాల్గొన్నారు. బార్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Follow Us