/rtv/media/media_files/2026/05/12/vijay-2026-05-12-16-57-45.jpg)
Vijay Meets AIADMK ‘Rebels’ As EPS Rival Shanmugam Says "Ready To Back TVK"
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో AIADMK పార్టీ ఆశించిన స్థాయిలో మెజార్టీ సీట్లు గెలవలేదు. దీంతో ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దాదాపు 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. పళనిస్వామి ప్రధాన ప్రత్యర్థి సి.వి. షణ్ముగం మాట్లాడుతూ.. తమ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సీఎం విజయ్ రెబల్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
#Breaking | Tamil Nadu CM #Vijay meets AIADMK rebel leaders @PoojaShali@AnaghaKesavpic.twitter.com/VVIOuG1BZe
— IndiaToday (@IndiaToday) May 12, 2026
ఇదిలాఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. చివరికి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీల సపోర్ట్‌తో విజయ్ బలం 120కి చేరింది. మే 13న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో దాదాపు 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us