/rtv/media/media_files/2026/05/08/tvk-vijay-2026-05-08-14-44-04.jpg)
TVK Vijay
టీవీకే విజయ్‌కు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వాలని కోరిన విజయ్ తీరుపై విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు సపోర్ట్ ఇవ్వాలని వాట్సాప్‌లో లేఖ పంపించడంపై వీసీకే నేతలు మండిపడుతున్నారు. మద్దతు కావాలంటే వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారా అంటూ వీసీకే జనరల్ సెక్రటరీ సెల్వన్ మండిపడ్డారు. మెజార్టీ కోసం విజయ్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నేరుగా కలిసి మద్దతు కోరలేని పరిస్థితిలో ఆయన ఉన్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీ కుట్రలను అడ్డుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని వీసీకే స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతివ్వడంతో అయిదు మంది ఎమ్మెల్యేల బలం చేకూరింది. విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో ఓ స్థానానికి మినహాయింపు ఉంటుంది. దీంతో మొత్తంగా టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 6 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. ఈ క్రమంలోనే ఆయన వాపపక్ష పార్టీలు, వీసీకే లాంటి చిన్న పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ తమకు సపోర్ట్ ఇవ్వాలని వాట్సాప్‌లో సందేశం పంపడంపై వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Follow Us