Vande Bharat: వందేభారత్‌లో మరోసారి పురుగుల ఆహారం.. ఫుడ్‌ కంపెనీకి రూ.10 లక్షల ఫైన్

వందేభారత్‌ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది.

New Update
Vande Bharat passenger finds insect in meal, IRCTC fines vendor Rs 10 lakh

Vande Bharat passenger finds insect in meal, IRCTC fines vendor Rs 10 lakh

వందేభారత్‌ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది. అతడు తనకు అందించిన ఫుడ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా అయ్యింది. ఇదే కోచ్‌లోని మరో ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో కూడా పురుగులు వచ్చాయి. దీంతో ఇతరు ప్రయాణికులు కూడా వాళ్లకు ఇచ్చిన ఆహారాన్ని తినలేదు. 

Also Read: బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ ఘటనపై స్పందించింది. ప్రయాణికుల ఆరోగ్యం, ఆహార భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది. దీంతో ఫుడ్‌ కాంట్రాక్టు సంస్థపై చర్యలకు దిగింది. ఏకంగా రూ.10 లక్షల ఫైన్ విధించింది. అలాగే వాళ్ల కాంట్రాక్టును కూడా వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఆహారాన్ని సరఫరా చేసిన కిచెన్‌ కూడా అధికారులు సీజ్‌ చేశారు.  

అయితే వందేభారత్‌ లాంటి ప్రీమియం రైళ్లలో ఎక్కువ ధరలు వెచ్చించి ప్రయాణించే వాళ్లకి ఇలాంటి నాసీకరమైన ఆహారం అందించడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జరిమానాలతో మాత్రమే సరిపెట్టకుండా రైల్వే కిచెన్‌లో నిరంతరంగా ఆకస్మిక తనిఖీలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.  

Also Read:  ప్రియుడే కావాలన్న భార్య.. కానిస్టేబుల్‌ ముందే గొంతుకోసిన భర్త

మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఆహార తయారీని అధికారులు పర్యవేక్షించాలని IRCT సూచించింది. దీనివల్ల ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో కూడా వందేభారత్‌ రైళ్లలోని ఆహారంలో పురుగులు వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఈ రైళ్లలో ఇచ్చే ఫుడ్‌పై ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అందుకే  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు