/rtv/media/media_files/2025/02/23/7AjcnXg74mByfczSl07I.jpg)
Uttar Pradesh minister's nephew in streetside brawl with flower vendor couple
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మంత్రి మేనల్లుడు వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడి చేశాడు. నాకే ఎదురు చెబుతావా? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ? అంటూ బెదిరిస్తూ వాళ్లతో ఘర్షణ పడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు మీరట్‌లోని ఓ విధిలో తన కారులో వెళ్తున్నాడు.
Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం
రద్దీగా ఉన్నటువంటి వీధుల్లోని తన స్కార్పియో వాహనానికి ఎదురగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీనివల్ల కారు, ఆటో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ పూలు అమ్ముకుంటున్న ఇద్దరు దంపతులు కారును ముందుకు పోనివ్వాలని అన్నారు. అప్పుడు మంత్రి మేనల్లుడితో ఉన్న సహాయకుడు.. ముందు ఆటో పోనివ్వండి, ఆ తర్వాత కారు కదులుతుందని వాదించాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు.. పూలు అమ్ముకునే వ్యాపారులను అసభ్యకరంగా దూషించారు. కారు దిగి పూల వ్యాపారిని పిడిగుద్దులు గుద్దాడు.
Also Read: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్
దీంతో పూల వ్యాపారి బంధువులు కూడా మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో గొడవ మరింత పెద్దదైంది. చివరికి సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు పాల్పడ్డ ఇరు వర్గాలపై కేసు పెట్టారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet.
— Manish RJ (@mrjethwani_) February 23, 2025
Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!