విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఉచితంగా స్కూటీలు

యూపీ ప్రభుత్వం మహారాణి లక్ష్మీభాయి అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించనుంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీను అందించే పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

New Update
Up Cm Yogiadityanath

Up Cm Yogiadityanath Photograph: (Up Cm Yogiadityanath)

విద్యార్థినుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను తీసుకొస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీని అందించే పథకాన్ని తీసుకురానున్నట్లు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. 2022లో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

ఉచిత స్కూటీ పథకానికి..

2025- 26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్‌ ఖన్నా ఉచిత బడ్జెట్‌న ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉచిత స్కూటీ పథకం గురించి ప్రతిపాదించారు. బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు యూపీ సీఎం తెలిపారు. అయితే ఉచిత స్కూటీ ఇచ్చే ఈ ప్రభుత్వ పథకానికి మహారాణి లక్ష్మీబాయి అని పేరు పెట్టినట్లు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nitish Kumar: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని బీజేపీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. ఎన్డీయే ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇవ్వాలన్నారు. దీంతో నితీశ్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి.

New Update
Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి. దీనికి కారణం బీజేసీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలే. మాజీ కేంద్రమంత్రి అయిన అశ్వినీ కుమార్ చౌబే తాజాగా మీడియాతో మాట్లాడారు.  జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని తెలిపారు. '' NDAకు నితీశ్‌ కుమార్ ఎంతో సేవ చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ఇలాంటిది జరిగిదే బీహార్‌ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్‌ కుమార్‌ నిలుస్తారని'' అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. అయితే గతంలో బీహార్‌ నుంచి ఉప ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ పనిచేశారు.  ఇదిలాఉండగా ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నీతిశ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం పదవిపై ఆశతో ఆయన మళ్లీ కూటమి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. 

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

ప్రస్తుతం బీహార్‌ రాజకీయాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ పార్టీ నితీశ్ కుమార్‌ను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత తాను నితిశ్‌ కుమార్‌ను డిప్యూటీ పీఎంగా చూడాలనుకుంటున్నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు