US Indo-Pacific Command: భారత్‌కు బిగ్ షాక్.. చైనాకు అమెరికా భయపడిందా? అందుకే 'ఇండో' పదాన్ని తొలగించిందా?

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు భారీ భరోసా ఇస్తూనే.. మరోవైపు అమెరికా మన దేశానికి ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. తమ అత్యంత పటిష్టమైన సైనిక విభాగం 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరు నుండి 'ఇండో' అనే పదాన్ని అమెరికా రక్షణ శాఖ సైలెంట్‌గా తొలగించేసింది.

New Update
US Indo

US Indo

ఓ వైపు ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. యుద్ధ సమయాల్లో భారతదేశానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, తాను అధికారంలో ఉన్నంత వరకు భారత్‌తో స్నేహం ఇలాగే కొనసాగుతుందని ట్రంప్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఇలాంటి భారీ భరోసా ఇస్తూనే.. మరోవైపు దేశానికి అమెరికా ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. తమ అత్యంత పటిష్టమైన సైనిక విభాగం 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరు నుండి 'ఇండో' అనే పదాన్ని అమెరికా రక్షణ శాఖ సైలెంట్‌గా తొలగించేసింది.

ప్రధాని మోదీతో స్నేహగీతం పాడుతూనే అమెరికా ఈ రకమైన షాకింగ్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? రోజురోజుకూ పెరుగుతున్న చైనా దూకుడుకు భయపడే ట్రంప్ ఇలా చేతులెత్తేశారా? లేక భారతదేశంతో దౌత్యపరమైన స్నేహం కంటే ట్రంప్‌కు చైనాతో చేసే వ్యాపారాలే ఎక్కువైపోయాయా? లేక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ ప్రాధాన్యతను పూర్తిగా తొక్కాలనే ఉద్దేశంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందా? అనే విషయాలు తెలుసుకుందాం.

అసలు ఏంటి ఈ 'పసిఫిక్ కమాండ్'?

అమెరికా కేవలం తన దేశ సరిహద్దులను మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి భూగోళాన్ని కొన్ని విభాగాలుగా విడదీసింది. వీటినే మిలిటరీ భాషలో 'కమాండ్స్' అంటారు. అంటే ఆయా ప్రాంతాల్లో అమెరికా సైనిక వ్యూహాలను, యుద్ధ నౌకలను నడిపించే పవర్‌ఫుల్ అడ్డా అన్నమాట. ఇలాంటి వాటిలో అన్నింటికంటే అత్యంత పురాతనమైనది, విస్తీర్ణంలోనూ, సైనిక బలగాల్లోనూ అన్నింటికంటే అతి పెద్దది ఈ పసిఫిక్ కమాండ్.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలపై తన పట్టు సాధించడం కోసం అమెరికా ఓ భారీ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే 1947 జనవరి 1వ తేదీన అప్పటి అమెరికా ప్రెసిడెంట్ 'హ్యారీ ఎస్.ట్రూమన్' ఈ పసిఫిక్ కమాండ్‌ను స్థాపించారు. దాదాపు 70 ఏళ్లకు పైగా ప్రపంచ రక్షణ చరిత్రలో దీన్ని యూఎస్ పసిఫిక్ కమాండ్ అనే పేరుతోనే పిలుస్తున్నారు. అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదలుకొని, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం దాటుకుంటూ నేరుగా భారతదేశ పశ్చిమ సరిహద్దు వరకు.. అంటే దాదాపు భూమి మీద ఉన్న సగం భాగం, అలాగే ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనం నివసించే ప్రాంతం అంతా ఈ ఒక్క కమాండ్‌లోకే వస్తుంది. 

రాజకీయ వ్యహమేనా?

అయితే ఇప్పుడు అమెరికా రక్షణ శాఖ సడెన్‌గా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సైనిక చరిత్రను గౌరవించడం కోసమే మళ్లీ పాత పేరును పెట్టామంటూ సింపుల్‌గా కవరింగ్ చేసింది. దీనికి తోడు అమెరికా కొత్త రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తన అఫీషియల్ సోషల్ మీడియాలో  యూఎస్ పసిఫిక్ కమాండ్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. పేరు మారినా తమ బాధ్యతలు మారవు అని అమెరికా పైకి యాక్టింగ్ చేస్తున్నా.. లోపల మాత్రం భారతదేశాన్ని పక్కన పెట్టేలా ఒక పెద్ద అంతర్జాతీయ వ్యూహమే నడుస్తోందని నిపుణులు చర్చించుకుంటున్నారు.

ఇప్పుడే ఎందుకు మార్చింది?

మరి 70 ఏళ్లుగా లేనిది.. మధ్యలో 'ఇండో' అనే పదాన్ని అమెరికా ఎందుకు చేర్చింది? ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే.. 2018కు వెళ్లాలి. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయం. ఈ సమయంలో ఆసియా ఖండంలో ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా విపరీతంగా రెచ్చిపోతోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాలను ఆక్రమించుకుంటూ, చిన్న చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి బెదిరిస్తుండేది. చైనా చేస్తున్న ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ గట్టిగా డిసైడ్ అయ్యారు.

కానీ చైనాను ఒంటరిగా ఎదుర్కొని ఆపడం అమెరికా వల్ల కూడా కాదని ట్రంప్‌కు అర్థమైంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు ధీటుగా నిలబడగలిగే దేశం భారత్ అని ట్రంప్ భావించారు. అసలు భారత్ సాయం లేకుండా చైనాను కట్టడి చేయడం అసాధ్యమని భావించిన అప్పటి ట్రంప్ ప్రభుత్వం.. మన దేశానికి ప్రపంచ వేదికపై ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలోనే యూఎస్ పసిఫిక్ కమాండ్‌గా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక సైనిక విభాగానికి ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ అని పేరు మార్చింది.  కానీ కేవలం ఎనిమిదేళ్లు తిరిగేసరికి.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిన్నటివరకు నెత్తిన పెట్టుకున్న 'ఇండో' పదాన్ని.. ట్రంప్ ఈ రోజు కరివేపాకులా తీసి పక్కన పడేశారు.

ఎనిమిదేళ్ల కిందట భారత్ ముఖ్యమన్న ట్రంప్.. ఇప్పుడు సడెన్‌గా ఇండియా పేరును ఎందుకు తీసేశారు? దీని వెనుక చైనా ఆధిపత్యం ఉందా? అనే అనుమానాలు నూటికి నూరు శాతం నిజమవుతున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో చైనా విషయంలో ట్రంప్ వైఖరి, ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే చైనా సైన్యం గనుక తైవాన్‌పై దాడి చేస్తే.. "మేము తైవాన్‌ను రక్షించలేం. ఎందుకంటే తైవాన్ అమెరికాకు చాలా దూరంలో ఉంది" అని ట్రంప్ ఓపెన్‌గానే చేతులెత్తేశారు.

అంతేకాదు అమెరికా తన కొత్త National Defense Strategy అధికారికంగా బయటపెట్టింది. ఇకపై ప్రపంచంలో ఉన్న మిత్రదేశాల రక్షణ భారాన్ని, దానికి అయ్యే వందల బిలియన్ డాలర్ల ఆర్థిక ఖర్చులను అమెరికా ఒక్కటే భరించలేదు. ఏ దేశానికి ఆ దేశమే తమ రక్షణ బాధ్యతలను, ఖర్చులను పంచుకోవాలని తెలిపింది. 

అయితే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో అనవసరంగా సైనిక గొడవలు పెట్టుకోవడం, యుద్ధాలు చేయడం ట్రంప్‌కు అస్సలు ఇష్టం లేదు. పైగా ట్రంప్ ఇటీవల చైనా పర్యటనకు కూడా వెళ్లి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే చైనాకు కోపం తెప్పించేలా ఉన్న ‘ఇండో’ అనే పదాన్ని కమాండ్ పేరులోంచి తొలగించిందని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును కట్టడి చేయడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి QUAD అనే అత్యంత దౌత్య, సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. గతంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ క్వాడ్ సదస్సులు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేవి. నాలుగు దేశాల సైన్యాలు కలిసి మలబార్ ఎక్సర్‌సైజెస్ పేరుతో ఉమ్మడి యుద్ధ విన్యాసాలు కూడా చేసేవి. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ క్వాడ్ కూటమి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశారు. 

గతేడాది భారత్‌లో ఘనంగా జరగాల్సిన ఈ క్వాడ్ దేశాల మెయిన్ సదస్సు రద్దయిపోయింది. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీలో జరిగిన మీటింగ్ కూడా కేవలం విదేశాంగ మంత్రుల స్థాయికే పరిమితమైంది. దేశాధినేతలు ఎవరూ రాలేదు. సరిగ్గా ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతున్న సమయంలోనే.. ఇటు పక్క అమెరికా రక్షణ శాఖ ఇండో పదాన్ని తొలగించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. 

ఇది క్వాడ్ కూటమి పతనానికి అమెరికా వేసిన మరో అడుగా? పేరులోంచి ఇండో అనే పదాన్ని తొలగించడం ద్వారా భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని అమెరికా తగ్గించుకుంటోందా? అంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ట్రంప్ దృష్టిలో క్వాడ్ కూటమికి కాలం చెల్లిపోయిందని, భారతదేశంతో కలిసి ఉమ్మడిగా చైనాను ఎదుర్కొనే ఓపిక, ఆసక్తి అమెరికాకు లేవని దీని ద్వారా స్పష్టమవుతుందన్నారు.

అయితే వివాదం ఇక్కడితో ఆగలేదు. కేవలం పేరు మార్చడంతో ఆపితే ఇది దౌత్యపరమైన మార్పు అనుకోవచ్చు. కానీ అమెరికా మన దేశ సార్వభౌమాధికారానికి అంతకంటే పెద్ద ద్రోహం చేసింది. యూఎస్ పసిఫిక్ కమాండ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే.. అక్కడ వాళ్లు అప్‌డేట్ చేసిన కొత్త మ్యాప్ కనిపిస్తోంది. ఆ మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను పూర్తిగా తప్పుగా చూపించారు.

మన దేశంలో అత్యంత కీలకమైన, అంతర్భాగమైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను, అలాగే చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాలను అసలు ఇండియా మ్యాప్‌లోనే చూపించలేదు. అవి వివాదాస్పద ప్రాంతాలు కదా అని అలా వదిలేశారా అంటే అదీ లేదు. మన పీఓకే భాగాన్ని నేరుగా పాకిస్తాన్ దేశంలో కలిపేసి చూపిస్తూ ఆ తప్పుడు మ్యాప్‌ను డిజైన్ చేశారు. అయితే ఈ వెబ్‌సైట్ పేజీని, మ్యాప్‌ను ఈ మధ్యే అమెరికా సైన్యం అప్‌డేట్ చేసింది. అమెరికా లాంటి పెద్ద దేశం, తన మిలిటరీ వెబ్‌సైట్‌లో ఇలాంటి తప్పుడు మ్యాప్ పెట్టడంపై తీవ్ర వివాదం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు