/rtv/media/media_files/2025/03/27/XvcePVNdB7BrvGIgNOPs.jpg)
UP man shared emotional video Dispute over dog defecating, young man injured after being run over by Fortuner
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో శైలేంద్ర అనే యువకుడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కపిల్ల కారణంగా ఒక రౌడీ తమను కొట్టి చంపేస్తానని బెదిరించినట్లు శైలేంద్ర, అతని భార్య కిరణ్ ఆరోపించారు. ఈ మేరకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు హోలీ రోజున ఫార్చ్యూనర్ కారుతో తనపైకి దూసుకెళ్లి చితకబాదడానికి ప్రయత్నించాడని బాధితుడు శైలేంద్ర అందులో పేర్కొన్నాడు. ఈ సంఘటన సిటీ కొత్వాలి ప్రాంతంలోని స్వరాజ్ కాలనీలో జరిగింది.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
ఏం జరిగిందంటే?
బాదితుడి ప్రకారం.. ‘‘వీధిలో ఒక కుక్కపిల్ల తిరుగుతోంది. దానికి నా పిల్లలు బిస్కెట్లు తినిపించేవారు. ఒకరోజు ఆ కుక్కపిల్ల అతడి కారుపై మలవిసర్జన చేసింది. అది చూసిన ఆ కారు యజమాని నాపై అసభ్యకరమైన భాషను ఉపయోగించాడు. నాకు పిస్టల్ చూపించి చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా హోలీ రోజున అతడు తన కారుతో నాపైకి దూసుకొచ్చాడు’’ అని బాధితుడు శైలేష్ చెప్పాడు. అయితే ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఐసియులో చేర్చారు. శైలేష్ తలపై 42 కుట్లు పడ్డినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కానీ నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
ఇందులో భాగంగానే బాధితుడు శైలేంద్ర, అతని భార్య కిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో వారిద్దరూ ఏడుస్తూ కనిపించారు. ఈ మేరకు సీఎం యోగి సహాయం కోరారు. నిందితుడు తనకు ఉన్న పలుకుబడి కారణంగా తనను చంపేస్తానని నిరంతరం బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. దీని కారణంగా తనతో పాటు తన కుటుంబం షాక్‌లో ఉన్నామని బాధితుడు చెప్పాడు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
పోలీసుల ప్రకారం.. దీనిపై బందా ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. నిందితులను అరెస్టు చేయడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నిజం ఏది అనేది ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’’ అని అన్నారు.
(crime news | latest-telugu-news | telugu-news | Latest crime news)