UP Govt: ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు..సీఎం యోగి ఆర్డర్ దేశ వ్యాప్తంగా ఆహార కేంద్రాల్లో నాణ్యత, శుభ్రత మీద వివాదాలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల అపరిశుభ్రంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అన్ని ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. By Manogna alamuru 24 Sep 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Yogi Aditya Nath: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుడ్ సెంటర్లలో ఆపరేటర్లు, యాజమాన్యాలు, మేనేజర్ల పేర్లు, చిరునామాలు స్పష్టంగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశించారు. దాంతో పాటూ చెఫ్‌లు, వెయిటర్లు తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని నియమం పెట్టారు. అదే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్‌లలో CCTV ఇన్‌స్టాలేషన్ తప్పనిసరిగ ఉండాలని...ఎప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్షన్ జరగాలని సీఎం యోగి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also Read : 12 వారాలు ఇలా చేస్తే సంతానలేమి సమస్య ఉండదు! రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో హోటల్స్, రెస్టారెంట్లలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు అస్సలు శుభ్రత పాటించడం లేదని తేలింది. సహరన్‌పూర్‌లోని ఒక హోటల్‌లో రోటీలను తయారు చేసే కర్రాడు పక్కనే ఉమ్ముతూ రోటీలను తయారు చేసే వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. దానివలన ఆ హోటల్ యజమాఇని అరెస్ట్ కూడా చేశారు. అలాగే ఘజియాబాద్‌లోని జ్యూస్ సెంటర్‌లో జ్యూస్‌లో మూత్రం కలిపి ఇస్తున్నాడన్న కారణంగా...ఆ సెంటర్ ఓనర్‌ను కూడా అరెస్ట్ చేశారు. జూన్‌లో, నోయిడాలో ఇద్దరు వ్యక్తులు తమ లాలాజలంతో కలుషితమైన రసాన్ని విక్రయించినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. దీని గురించి సీఎం మాట్లాడుతూ ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలు అసహ్యంగా ఉండటమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయని...అందుకే హానికరమైన పదార్ధాలతో ఆహారాన్ని కల్తీకి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన అన్నారు. Also Read : శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నియామకం.. దేశవ్యాప్తంగా ఆహార కల్తీ కేసులు పెరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లు సహా అన్ని ఆహార సంబంధిత సంస్థలపై సమగ్ర విచారణ జరిపి ధృవీకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి సవరణలు చేయాలని ఆదిత్యనాథ్ కోరారు . ధాబాలు, రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలు క్షుణ్ణంగా తనిఖీలు చేసి.. ఉద్యోగులందరి పోలీసు ధృవీకరణ తప్పనిసరి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. Also Read : టైఫాయిడ్ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు? #food #cm-yogi-adityanath #up-govt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి