Bharat Taxi: యాప్ లాంచ్ చేసిన అమిత్ షా.. త్వరలోనే హైదరాబాదీలకు గుడ్‌న్యూస్

ప్రైవేటు సెక్టార్ ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్‌, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గురువారం కేంద్రమంత్రి అమిత్ షా ఈ వినూత్న ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

New Update
bharath taxi

ప్రైవేటు సెక్టార్ ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్‌, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గురువారం కేంద్రమంత్రి అమిత్ షా ఈ వినూత్న ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రైవేటు సంస్థలు డ్రైవర్ల నుండి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 'మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీస్ యాక్ట్' కింద ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో 'జీరో కమీషన్' విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే, కస్టమర్లు చెల్లించే మొత్తంలో ఎటువంటి కోత లేకుండా టోటల్ డబ్బులు నేరుగా డ్రైవర్లకే దక్కుతుంది.

2025 డిసెంబర్ 2 నుండి ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తర్వరలోనే హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అటు కస్టమర్లు, డ్రైవర్లకు బెనిఫిట్ జరగనుంది. 3 లక్షల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో చేరారు. లక్ష మంది యూజర్లు రిజిస్టర్ చేసుకోగా, రోజుకు సగటున 10 వేల రైడ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటివరకు డ్రైవర్లకు సుమారు రూ. 10 కోట్ల లాభాలు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారత్ ట్యాక్సీ కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా భరోసా ఇస్తుంది. ఇందులో చేరిన డ్రైవర్లకు 'సారథి' పథకం ద్వారా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే, పీక్ అవర్స్‌లో వినియోగదారులపై అదనపు భారం పడకుండా 'సర్జ్ ప్రైసింగ్' లేని విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఫస్ట్ ఢిల్లీ, గుజరాత్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ద్వారక నుండి అస్సాం వరకు భారత్ ట్యాక్సీ సేవలు లభిస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కార్లు, ఆటోలు, బైక్ టాక్సీలు కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు