HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు

మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి.  నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు  దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. 

New Update
Virus nagapur

Virus nagapur Photograph: (Virus nagapur)

హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు ఇండియాలో ఎంటరై చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనవరి 06వ తేదీన సోమవారం చెన్నై, బెంగళూరుల్లో ఇద్దరేసి చొప్పున.. అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్‌ నిర్ధారణ కాగా తాజాగా మంగళవారం రోజున మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి.  నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  7, 13 ఏళ్ల చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.  ఇద్దరు చిన్నారులు  దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. శ్వాసకోశ లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి.  2025 జనవరి 3న నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు పిల్లల్లో HMPV ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.   ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.  

Also Read :  ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

Also Read :  చైనా, టిబెట్ భూకంపాలు...36 మంది మృతి

ఆందోళన అవసరం లేదు

ఇండియాలో కేసులు రోజురోజుకు పెరుగుతుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని సూచనలు చేస్తున్నాయి. నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ..  హెచ్‌ఎంపీవీ వైరస్ పై అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఇది కొత్త వైరస్ కాదన్న నడ్దా..   2001లో ఈ వైరస్‌ను గుర్తించారని చెప్పుకొచ్చారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని..  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం-గా ఉన్నట్లుగా వెల్లడించారు.  

హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. వివిధ దేశాల్లో హెచ్‌ఎంపీవీతో సంబంధం కలిగిన శ్వాసకోస వ్యాధుల కేసులు నమోదైనట్లు చెప్పింది. ఇలాంటి కేసులు భారత్‌లో పెరిగినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది.

Also Read :  40 ఏళ్ల నిరీక్షణ .. బీహార్ మహిళకు భారత పౌరసత్వం

Also Read :  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు