/rtv/media/media_files/2026/05/04/pawan-kalyan-kcr-and-vijay-2026-05-04-17-20-25.jpg)
Pawan kalyan, KCR and Vijay
తమిళనాడు ఎన్నికల్లో టీఎంకే విజయ్ సంచలనం సృష్టించారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా విజయం సాధించారు. పెరంబూర్ నుంచి బరిలోకి దిగిన విజయ్.. డీఎంకే అభ్యర్థి ఆర్.డి శేఖర్‌పై 40 వేల ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే తిరుచ్చి ఈస్ట్‌లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు టీవీకే 109 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్.. ఏ పార్టీని కలుపుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గాజువాక, భీమవరం నుంచి రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయినప్పటికీ ఈ రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన రెండు స్థానాల్లో ఓడిపోవడంతో జనసేనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పవన్‌పై కూడా సెటైర్లు వేశారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ సైతం గజ్వేల్, కామారెడ్డి నుంచి రెండు చోట్ల బరిలోకి దిగారు. గజ్వేల్‌లో గెలిచినప్పటికీ కామారెడ్డిలో మాత్రం ఆయన ఓడిపోయారు. మొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. చివరికి ఎన్నికల ఫలితాల్లో ఈ రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇలా రెండు చోట్ల పోటీ చేసి పవన్, కేసీఆర్ విఫలమయ్యారని.. విజయ్ మాత్రం విజయం సాధించారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Follow Us