తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్‌ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సూచనల మేరకు AIADMK పార్టీ.. TVKతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

New Update
TVK Vijay and Amit Shah

TVK Vijay and Amit Shah

తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్‌ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సూచనల మేరకు AIADMK పార్టీ.. TVKతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే.. బీజేపీతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా విడుదలయ్యాయి. విజయ్ పార్టీ 10 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటుందని మెజార్టీ సర్వేలు అంచనా వేశాయి. దీంతో ఈ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్‌ ఉత్కంఠను పెంచాయి.  

Also Read: పశ్చిమ బెంగాల్‌లో TMCదే అధికారం.. సునీల్‌ మౌర్య సంచలన సర్వే

యాక్సెస్ మై ఇండియా సర్వే ప్రకారం టీవీకే పార్టీ రాష్ట్రంలో సింగ్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. 234 స్థానాలున్న తమిళనాడులో అధికారంలోకి రావాలంటే 118 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ లభించని నేపథ్యంలో విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆయన AIADMK, బీజేపీతో కలిస్తే సీఎం పదవి డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.  

Advertisment
తాజా కథనాలు