/rtv/media/media_files/2026/06/17/fotojet-8-2026-06-17-09-52-02.jpg)
ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ వేదికపై భారతదేశం మరోసారి తన సత్తా చాటింది. ఈ సదస్సులో అసలు సభ్యదేశం కాకపోయినప్పటికీ.. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యత కారణంగా వరుసగా ఎనిమిదోసారి ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు భారత్ ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ సదస్సు హాల్ లోకి వెళ్లిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోటోకాల్‌ను సైతం పక్కనబెట్టి.. గౌరవించి నిలబడ్డారు. మోదీకి షేక్ హ్యాండ్ చాలా సమయం ఇస్తూ చివరకు భుజం తట్టారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైన ట్రంప్.. మోదీకి ఇచ్చిన ఈ అసాధారణ గౌరవాన్ని చూసి అక్కడ ఉన్న అంతర్జాతీయ ప్రతినిధులంతా షాక్ అయ్యారు.
This is Modi meeting Trump after USA killed 3 Indian mariners.
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) June 16, 2026
Look at how happy Modi looks. pic.twitter.com/aSDVn7eAYw
ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ఎలాగైనా ఒంటరి చేయాలని నిరంతరం కుట్రలు పన్నే పొరుగు దేశం పాకిస్తాన్‌కు ఈ జీ7 సదస్సు ఘటనతో బిగ్ షాక్ తగిలింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్.. ఎలాగైనా అమెరికా సపోర్ట్ తీసుకోవాలని ఎన్నో పాట్లు పడుతోంది. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రస్తుత జీ7 సదస్సు వేదికపై మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీకే బ్రహ్మరథం పట్టడం, ప్రోటోకాల్ పక్కనబెట్టి గౌరవించడంతో పాక్‌కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.
Some people are spreading propaganda that President Donald Trump ignored PM Narendra Modi during the G7 family photo.
— News Algebra (@NewsAlgebraIND) June 16, 2026
This video tells different story.
Footage shows PM Modi offering support to Trump, who briefly leaned on him before taking his place beside him. pic.twitter.com/15vtZ8NFzQ
ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!
ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న చారిత్రాత్మక శాంతి ఒప్పందంలోనూ, రాబోయే రోజుల్లో జెనీవాలో జరగబోయే శాంతి చర్చల్లోనూ భారత్ మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ఐరోపా పర్యటనలో భాగంగా స్లోవేకియా పర్యటన ముగించుకుని ఫ్రాన్స్ చేరిన మోదీ.. జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడా, జపాన్ దేశాల అధినేతలతో కలిసి ప్రపంచ ఆర్థిక, రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు.
Follow Us