/rtv/media/media_files/2026/05/11/fotojet-2026-05-11-08-33-10.jpg)
Trisha..vijay and family
Trisha : తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మహోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు దేశీయ రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పాల్గొని నూతన సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
Vijay’s swearing-in ceremony.. Trisha tears #trisha#TVKVijay#TVK#Vijay#VijayTNCM#tamilnadupic.twitter.com/2xQUALlIzh
— srk (@srk9484) May 11, 2026
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరోయిన్ త్రిష
ఈ ప్రమాణ స్వీకార వేడుకలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిండుగా చీరకట్టుకొని, కొప్పున మల్లెపూలు పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా హాజరైన త్రిష, స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ భావోద్వేగ ప్రసంగం చేస్తున్న సమయంలో త్రిష ఎంతో ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో ఆమె కళ్లవెంట నీళ్లు తిరిగాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. "సంతోషం వచ్చినా కన్నీళ్లు ఆపలేము" అంటూ కామెంట్లు పెడుతున్నారు. స్టేడియంలోకి వచ్చేటప్పుడు మీడియా ప్రతినిధులు త్రిషను పలకరించగా, విజయ్ సీఎం అవ్వడంపై ఆమె తన సంతోషాన్ని పంచుకుని, శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు.
తిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా
టీవీకే అధినేత విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో (తిరుచ్చి ఈస్ట్, పెరంబూరు) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో ఆయన తిరుచ్చి ఈస్ట్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూరు ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగనున్నారు. ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించారు.
త్రిష రాజకీయ అరంగేట్రం.. సినిమాలకు గుడ్‌బై?
ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. విజయ్ రాజీనామా చేసిన 'తిరుచ్చి ఈస్ట్' స్థానం నుండి ఉప ఎన్నికల్లో త్రిషను పోటీ చేయించి, ఆమెను అసెంబ్లీకి పంపే యోచనలో విజయ్ ఉన్నట్లు సమాచారం. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలనేది త్రిష కల కావడంతో.. ఈ అవకాశం వస్తే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆమె ప్రజాసేవకే అంకితం కానున్నారట. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆమెను విజయ్ తన క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి సరసన నటిస్తున్న 'విశ్వంభర', తమిళంలో 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) అనే సినిమాలు మాత్రమే ఉన్నాయి. 'కరుప్పు' చిత్రం మే 14న విడుదల కానుంది. కొత్త సినిమాలేవీ ఒప్పుకోకపోవడంతో త్రిషను త్వరలోనే సింపుల్ లుక్‌లో అసెంబ్లీలో చూస్తామా అనే ఆసక్తి నెలకొంది.
విజయ్ కుటుంబ సభ్యులు ఎక్కడ?
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ విజయ్ సీఎం కుర్చీని దక్కించుకున్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఒక లోటు మాత్రం అభిమానులను కలవరపెడుతోంది. ఇంత పెద్ద వేడుకలో విజయ్ కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించలేదు. ఆయన భార్య సంగీతతో పాటు, కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కొడుకు జాసన్ తండ్రి విజయ్ విజయంపై స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంటే, ఆయన కుమారుడు జాసన్ సంజయ్ మాత్రం దర్శకుడిగా మారి సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో విభేదాల వల్లే కుటుంబం దూరంగా ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
Follow Us