/rtv/media/media_files/2025/01/23/hbruFvO1TN8XP5jMnrFd.jpg)
Minister Jitendra SIngh
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో ఇటీవల మిస్టరీ మరణాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నెలన్నర రోజుల వ్యవధిలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మరణాలకు కారణం అంటువ్యాధి కాదని స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. '' మిస్టరీ మరణాలు బ్యాక్టీరియా, వైరస్ వల్ల జరగలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు
కంటైన్‌మెంట్ జోన్‌గా బుధాల్..
కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించాం. అవి ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాటిపై దర్యాప్తు జరుగుతోంది. ఇతర కోణాల్లో కూడా దీనిపై విచారిస్తున్నారు. ఏదైన కుట్ర జరిగినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని'' మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇదిలాఉండగా.. బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అక్కడి అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు జరపకూడదని ఆదేశించారు.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
అలాగే బాధిత కుటుంబాలు, వాళ్ల సన్నిహితలు కేవలం ప్రభుత్వ అధికారులు అందించే ఆహారమే తీసుకోవాలని చెప్పారు. వాళ్ల ఇళ్లల్లో ఉన్న ఇతర పదార్థాలు కూడా వినియోగించకూడదని హెచ్చరించారు. మరోవైపు దీనిపై విచారణలో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లల్లో ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకొని వాటిని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం 11 మందితో కూడిన బృందం ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తు చేస్తోంది.
Also Read: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్!
Also Read: సైఫ్ దాడి సీన్ ను రీక్రియేట్ చేసిన పోలీసులు..ఏసీ కండక్టర్ నుంచి..