ఢిల్లీ ఎన్నికల ఫలితాలు :  బీజేపీకి షాక్ ..  మళ్లీ లీడింగ్ లోకి ఆప్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ మళ్లీ లీడింగ్ లోకి వస్తోంది.  ట్రెండ్స్‌లో, బిజెపి మరియు ఆప్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ కూడా 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

New Update
kejriwal, aap

kejriwal, aap

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ మళ్లీ లీడింగ్ లోకి వస్తోంది.  ట్రెండ్స్‌లో, బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ కూడా 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. చాలా చోట్ల అభ్యర్థుల అధిక్యాలు 500 నుంచి 1000 లోపు ఉన్నాయి.  దీంతో ప్రతి రౌండ్ ముగిసే సరికి నంబర్లు అటు ఇటు మారుతున్నాయి.  మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం అధిపత్య నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి.  

ఇక  చాలా సేపు వెనుకంజలో ఉన్న ఆప్ అభ్యర్థులు లీడింగ్ లోకి వస్తున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుండి 340 ఓట్లతో  ముందంజలో ఉండగా, బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ వెనుకబడి ఉన్నారు. జంగ్‌పురా సీటులో రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా 1800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీలో సీఎం అతిషి కూడా 1314 ఓట్లతో  ముందంజలో ఉన్నారు.  బీజేపీకి చెందిన కైలాష్ గహ్లోట్ 2714 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రి అయిన గహ్లోట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు