Gas shortage : దేశంలో వంట గ్యాస్‌ కొరత.. అక్కడ హోటల్స్‌ అన్ని క్లోజ్‌

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా  కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది.

New Update
FotoJet (30)

Gas shortage

Gas shortage : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా  కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 60, కమర్షియల్ ధర రూ. 115 మేర పెరగగా ప్రస్తుతం అసలు గ్యాస్‌ లభించని పరిస్థితి నెలకొంది.


పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికాల  మధ్య రోజురోజుకు ముదురుతున్న యుద్ధంతో  భారతీయ హోటల్, ఆహార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అకస్మాత్తుగా ఏర్పడిన అంతరాయం మూలంగా మహారాష్ట్ర, పశ్చిమ్​ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా బెంగళూరు, ముంబాయిలోని హోటళ్లు మంగళవారం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
 
బెంగళూరులో సోమవారం నుంచి హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం (మార్చి 10) నుంచి నగరంలోని హోటళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ ప్రకటించడం గమనార్హం. దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ..పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.యుద్ధం మొదలైన తర్వాత “గ్యాస్ సరఫరాలో 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చాయి. కానీ అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడం హోటల్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి, కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి మాకు మద్దతు తెలపాలి,” అని హోటల్స్‌ అసోసియేషన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మరోవైపు ముంబాయిలోనూ వాణిజ్య సిలిండర్ల కొరత (LPG shortage) కారణంగా 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ విషయాన్ని ముంబయి హోటల్‌ అండ్‌ రెస్టారంట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది.

ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ ల మధ్య యుద్ధం మొదలై  రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల మూలంగా గ్యాస్‌ సరఫరా నిలిపివేతకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్యాస్‌ కొరత ప్రభావం  కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు. కోల్‌కతా, ముంబయి వంటి నగరాలకు విస్తరించింది. ఆయా నగరాల్లోని రెస్టారెంట్లు, బేకరీలు కూడా ఎల్​పీజీ గ్యాస్​ కొరతతో మూసివేతకు చేరువవుతున్నాయి. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నాన్-డొమెస్టిక్ (కమర్షియల్) ఎల్​పీజీ పంపిణీని నిలిపివేసింది. దీంతో వ్యాపారులు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. గ్యాస్‌ సరఫరా పునరుద్ధరించకపోతే హోటల్ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముంబైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.“మరో రెండు రోజుల్లో గ్యాస్​ సిలిండర్ల కొరతను పరిష్కరించకపోతే ముంబైలోని అన్ని రెస్టారెంట్లు మూతపడతాయి,” అని ఇండియా హోటల్స్​ అండ్​ రెస్టారెంట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ విజయ్​ శెట్టి స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే  వ్యాపారులకు కోట్లల్లో నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisment
తాజా కథనాలు