/rtv/media/media_files/2025/02/10/YV7PHX6OVV0POH0BZNWu.webp)
Maha Kumbhmela 2025
Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు.పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.ముగింపు నాటికి భక్తుల సంఖ్య 5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహాశివరాత్రి(Mahashivratri)తో కుంభమేళా ముగియనుంది. కాగా, పుణ్యస్నానాలకు మాత్రం మరో రెండు ముహూర్తాలే మిగిలి ఉన్నాయి.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి(Bhogi), మకర సంక్రాంతి(Makara Sankranthi), పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. కుంభమేళాలో తదుపరి రాజ స్నానం లేదా అమృత స్నానం మాఘ పూర్ణిమ రోజున జరగబోతోంది. అంటే ఈ నెల 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఈ పుణ్య స్నానం జరగబోతోంది. ఆ రోజు స్నానం కోసం ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు బయల్దేరారు. మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
శివరాత్రితోనే కుంభమేళా(Maha Kumbhmela 2025) పూర్తి..
మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 06.55 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 07.22 గంటలకు ముగుస్తుంది.సాధారణంగా ఉదయ తిథికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఫిబ్రవరి 12 ఉదయం కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తారు. ఈ రోజున కూడా కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు. శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది. దీంతో..ఈ చివరి రెండు పవిత్ర స్నానాలకు ముఖ్యమైన ముహూర్తాలు గా భావిస్తుండటంతో దీనికి అనుగుణంగా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా మహా శివరాత్రితో కుంభమేళా ముగియనుండటంతో రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలి వెళ్తున్నారు.
Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!