/rtv/media/media_files/2025/04/02/sQVm38TNYm3OK9lv3QZi.jpg)
Waqf Bill
Waqf Bill: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయిస్తున్నట్లుగా అధికారపక్షం తెలపగా, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభా సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, డీఎంకే వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ బిల్లు సభలో ఆమోదం పొందడం లాంఛనప్రాయమేగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతమున్న 542 మంది ఎంపీలకు గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం ఉంటుంది. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై బీజేపీ విశ్వాసంతోనే ఉంది.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన
సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వీటి పరిధిలో 9.4లక్షల ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇవే అత్యధికం కావడం విశేషం. అయితే వాటిలో చాలావాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ఒక ఆస్తిని వక్ఫ్‌గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాల్ని తగ్గించి బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లును ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ అంటే ముస్లింలు చేసే దానం. ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ బిల్లుపై వ్యతిరేకత రావడంతో వివిధ పార్టీల 31 మంది ఎంపీలతో కమిటీ వేసింది.
Also read : Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!