
chhattisgarh encounter Photograph: (chhattisgarh encounter)
ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దులో జనవరి 19న మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఛత్తీస్ గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడు చంద్రహాస్ అలియాస్ పాండు చనిపోయాడని పోలీసులు బావించారు. గరియాబంద్ ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందారంటూ ప్రచారం జరుగుతోంది. చనిపోయింది పాండు కాదని.. ధమరీ-గరియా బంద్-నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్యం గాన్దే అని పోలీసులు తెలిపారు. అతని స్వస్థలం ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా ఉప్పర్పారా గ్రామం.
Also Read: హైదరాబాద్ కిడ్నీ రాకేట్ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు
ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారి ఫొటోలు, వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇందులో పాండు అలియాస్ చంద్రహాస్ వివరాలను లేవు. పాండు అలియాస్ చంద్రహాస్ పై రూ.20 లక్షల రివాడ్ కూడా ఉంది. 1985లో గద్దర్ టీమ్‌లో చంద్రహాస్ కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్లో మావోయిస్టు కీలక నేత మృతి
మొదట్లో చంద్రహాస్ జననాట్య మండలిలో పనిచేశారు. గిరిజనుల పక్షాన నిలబడి వారికి సన్నిహితంగా ఉంటూ మాడ్ ఉద్యమానికి బీజం వేశారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎన్‌కౌంటర్ లో చనిపోయిని వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాయ్‌పుర్‌కు తరలించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2024లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 290గా ఉంది.