Thalapathy Vijay : ఐఎండీబీ రేటింగ్స్‌లో దూసుకెళ్లిన దళపతి విజయ్...21 నుంచి ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ

దళపతి విజయ్ వరుసగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) 'మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల' తాజా జాబితాలో విజయ్‌ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.

New Update
FotoJet - 2026-05-13T124627.897

prabhas and vijay

Thalapathy Vijay : సినిమా రంగంలో అగ్ర నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న దళపతి విజయ్ (Vijay), ఇప్పుడు రాజకీయ రంగంలోనూ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసి, సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ బలమైన రాజకీయ ముద్రతో విజయ్ క్రేజ్ మరింత రెట్టింపు అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) విడుదల చేసిన 'మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల' తాజా జాబితాలో విజయ్‌ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.

21వ స్థానం నుండి టాప్-2లోకి రికార్డు జంప్

గత వారం ఐఎండీబీ జాబితాలో 21వ స్థానంలో ఉన్న విజయ్, కేవలం వారం వ్యవధిలోనే టాప్-2 లోకి దూసుకురావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా వినియోగదారుల వాస్తవ పేజీ వీక్షణల (Page Views) ఆధారంగా ఈ జాబితాను అధికారికంగా రూపొందించినట్లు ఐఎండీబీ సంస్థ వెల్లడించింది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవడం వంటి తాజా రాజకీయ పరిణామాలు గ్లోబల్ లెవెల్‌లో విజయ్ పేజీ వీక్షణలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

ఐఎండీబీ తాజా పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో నటుడు, దర్శకుడు అంబరీష్‌ వర్మ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సప్నే Vs ఎవ్రీవన్‌ సీజన్‌:2’ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై భారీ ఆదరణ పొందడంతో ఆయన టాప్‌లోకి వచ్చారు. కాగా, ఇదే జాబితాలో నటి సాయిపల్లవి ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సాయిపల్లవికి ఈ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు దక్కింది.

ఓర్మాక్స్ నివేదికల్లోనూ ప్రభాస్, విజయ్ హవా

మరోవైపు, ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ (Ormax) నిర్వహించిన తాజా సర్వేలలోనూ సౌత్ స్టార్స్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ'గా,పాపులర్ హీరోల జాబితాలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నంబర్ 1 స్థానంలో అజేయంగా కొనసాగుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో (రెండో స్థానం) దళపతి విజయ్ తన క్రేజ్‌ను పదిలపరుచుకున్నారు.

ఓర్మాక్స్ తాజా టాప్-10 పాపులర్ హీరోల జాబితా

ప్రభాస్ (నెం.1 స్థానం)

విజయ్ (రెండో స్థానం)

షారుఖ్ ఖాన్ (టాప్-3)

అల్లు అర్జున్ 5. ఎన్టీఆర్ 6. రామ్ చరణ్ 7. మహేష్ బాబు 8. నాని (ఇటీవలి కాలంలో టాప్-10లోకి ఎంట్రీ)

అజిత్ కుమార్

అక్షయ్ కుమార్

సినిమా ,రాజకీయ రంగాల్లో ఏకకాలంలో సంచలనం సృష్టిస్తూ, ఉత్తరాది, దక్షిణాది స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సమంతలను వెనక్కి నెట్టి విజయ్ ఐఎండీబీ , ఓర్మాక్స్ వంటి ప్రముఖ గ్లోబల్ సర్వే నివేదికల్లో టాప్-2 స్థానంలో నిలవడం ఆయన తిరుగులేని ప్రజాదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు